Kapil Mishra Hints at Another Big Disclosure

Kapil mishra promises more exposes on sunday

Kapil Mishra, Kapil Mishra Sunday Blast, Kapil Mishra Aravind Kejriwal, Kejriwal Kapil Mishra Row, AAP Internal Crisis, Kapil Mishra Mother, Kapil Mishra BJP Agent, Kapil Mishra Mother, Sacked AAP Minister, Kapil Mishra Allegations, Kapil Mishra Mother BJP, Annapurna Mishra Aravind Kejriwal, Aravind Kejriwal Sunday Allegations

Suspended Aam Aadmi Party leader Kapil Mishra has promised to make more “revelations” on Sunday. Kapil's Mother Annapurna writes a letter to Arvind Kejriwal and slammed him.

కేజ్రీ నెత్తిన ఆదివారం మరో బాంబు

Posted: 05/12/2017 01:03 PM IST
Kapil mishra promises more exposes on sunday

తనను మంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్రమైన ఆరోపణలు చేసిన ఆప్ మాజీ నేత కపిల్ శర్మ మరో సస్పెన్స్ కు తెరలేపాడు. కేజ్రీవాల్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ, చుట్టూ పోలీసుల భద్రత నడుమ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ఆదివారం మరిన్ని సంచలన విషయాలను వెల్లడిస్తానని ప్రకటించాడు.

ఆయన కుంభకోణాలు చేశారని ఆరోపిస్తూ అందుకు ఆధారాలను ఏసీబీ, లెఫ్టినెంట్ గవర్నర్ లకు ఇచ్చానని చెప్పిన కపిల్ శర్మ కీలక వ్యాఖ్య చేయటం విశేషం. తాను చేసిన ఆరోపణలు నిజం కనుకనే ఇంతవరకూ కేజ్రీవాల్ నోరు మెదపలేదని అన్నారు. కేజ్రీ ఇంత నిశ్శబ్దంగా ఉండటం తానెన్నడూ చూడలేదని, వాటర్ ట్యాంకర్ స్కామ్ తో పాటు, అక్రమంగా నిధులు కూడబెట్టి, ఐదుగురు ఆప్ మంత్రులను ఆయన విదేశాలకు పంపించారని ఆరోపించాడు.

తనపై దాడి చేయించింది కూడా ఆయనేనని(కేజ్రీవాల్), అవినీతి ఆరోపణలను పక్కదారి పట్టించేందుకే ఈవీఎం మెషీన్ల ఇష్యూను తెర మీదకు తెస్తున్నారని ఆరోపించాడు. ఇక అసత్య ఆరోపణలతో బీజేపీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నాడన్న ఆప్ కామెంట్లపై కపిల్ తల్లి తీవ్రంగా స్పందించింది. తన కొడుకు సత్యానికి మాత్రమే కట్టుబడి ఉంటాడని, పార్టీలకు కాదని చెబుతోంది. బీజేపీ నేత అయిన అన్నపూర్ణ మిశ్రా ఈ మేరకు కేజ్రీవాల్ కు ఓ లేఖ బహిరంగ లేఖ రాయటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kapil Mishra  Aravind Kejriwal  Bribe Allegations  Annapurna Mishra  

Other Articles