Women Abuse and Assault Policeman in Chandigarh పోలిసుపై ఇద్దరు యువతుల రచ్చరంబోలా..!

Two drunk women assulted cop who gave them chase in chandigarh

drunk women assult police, drunk women assult cop, drunk women chandigarh police, drunk women police chase, drunk women police uniform, chandigarh drunk women arrested, drunk women, Chandigarh police, SAS Nagar residents, lawless women, Sector 43 bus stand, Punjab, India, Women, Traffic, Police, crime

Two women in their 20s, both SAS Nagar residents, were arrested for allegedly assaulting a traffic cop and tearing his uniform.

ITEMVIDEOS: పోలిసుపై ఇద్దరు యువతుల రచ్చరంబోలా..!

Posted: 05/11/2017 03:10 PM IST
Two drunk women assulted cop who gave them chase in chandigarh

మద్యం మత్తు ఎంతటి మంచివారినైనా దానిని సేవించగానే చెడ్డవారిగా మలిచేస్తుంది. ఈ మధ్యకాలంలొ మద్యం మత్తులో జరుగుతున్న ప్రమాదాల సంఖ్య కూడా అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో మద్యం సేవించి వాహనాలను నడపకపోవడమే మంచిదన్న సూచనలు కూడా అధికంగా వినబడుతున్నాయి. తాగితే మర్చిపోగలము.. తాగనివ్వరూ.. అంటూ ఏదో విషయంలో మదనపడి అ వ్యధ నుంచి బయట పడేందుకు మద్యం సేవించిన ఇద్దరు యువతులు తమ ప్రతాపాన్ని ఓ అమాయక ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చూపారు. రెడ్ సిగ్నల్ పడినా అగని వారిని వెంబడించి.. పోనిలే యువతులని ఊరుకుని వెళ్లిపోతున్న  కానిస్టుబుల్ పై విరుచుకుపడిన యువతులు అతని పోలీస్ యూనిఫాం ను చించేసి.. రచ్చరంబోలా చేశారు. చివరకు తన కోపమె తన శత్రువు అని తెలుసుకున్నారు. కానీ అప్పటికే పుణ్యకాలం గడిచిపోవడంతో కటకటాల వెనక్కి చేరుకున్నారు.

చంఢీగడ్ లో ఇద్దరు యువతులు పీకల వరకు మద్యం సేవించి, ఆ మత్తులో ట్రాఫిక్ సిగ్నళ్లను జంప్ చేసి వెళుతున్నారు. డ్రైవింగ్ చేస్తున్న 29 ఏళ్ల యువతి స్వయంగా పోలీసు సిగ్నల్ ఇచ్చినా ఆగకుండా వెళ్లి పోయింది. మార్గమద్యలో ట్రాఫిక్ జామ్ కావడంతో ఇరుక్కుపోయిన యువతుల కారును.. పది నిమిషాల పాటు వెంబడిస్తూ వస్తున్న పోలిసుల జీవు ఎట్టకేలకు నిలువరించింది. వారిని నిలిపి కారు రెడ్ సిగ్నల్ ఫడినా అగకుండా ఎందుకు వచ్చేశారంటూ వారిని నిలదీశారు. పోలీసులు వచ్చి తమను ప్రశ్నిస్తున్నా.. తప్పు జరిగింది.. మన్నించండీ అంటే పోయేదానికి వారితో వాదనకు దిగారు.

అప్పటికీ, అమ్మాయిలే కదా ఏదో ఒకటి సర్ది చెప్పి పంపిద్దామని పోలీసులు కూడా భావించారు. తప్పు తాము చేసి.. నేరం మాత్రం అవతలివాళ్లపై వేసినట్లుగా.. యువతులు రెడ్ సిగ్నల్ జంప్ చేసి.. మరోవైపు పోలీసులతో వాదనకు దిగారు. అంతేకాదు దారిన పోయేవారు వారిని సముదాయించి శాంతపర్చేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇద్దరిలో ఒక యువతి పోలీసులతో గొడవ పెట్టుకుంది. మరో యువతి కారులో ఉన్న బీర్ బాటిల్ తీసుకొచ్చి, తలమీద పగలగొట్టుకుంది. ఆ తర్వాత పోలీసులపై ఇద్దరూ కలిసి దాడికి దిగారు. నానా రచ్చ చేసి.. ఔరా వీళ్లు అమ్మాయిలేనా.. అనిపించేలా చేశారు.

దీంతో బిత్తెరపోయిన పోలీసులు తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇద్దరు యువతులు సిగ్నల్ జంప్ చేయడమే కాకుండా.. ఏకంగా తమపై విరుచుకుపడి తమ డ్రెస్ ను కూడా చించివేసి దాడికి పాల్పడ్డారని చెప్పారు. దాంతో ఉన్నతాధికారుల అదేశాల మేరకు.. అప్పటికే సాయంత్రం 7 గంటలు కావస్తున్నందున వారిని అ రోజు వదిలేసి.. తెల్లవారే వరకు వేచిచూసి.. మరుసటి రోజు ఉదయం వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఐపీసీ 332, 353 సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. ఈ మొత్తం తతంగాన్ని రొడ్డుపై వెళ్తున్న వాహనదారులు తమ మోబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో.. అది కాస్తా హల్ చల్ చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drunk women  Chandigarh police  SAS Nagar residents  lawless women  Sector 43 bus stand  crime  

Other Articles