Wedding Hall Collapses 23 People Dead in Rajasthan

23 killed as wall at wedding venue collapses after heavy rain

Rajasthan Bharatpur, Wedding Hall Collapse, Wedding Hall Wall Fall, Rajasthan Wedding Hall Mishap, Heavy Rain Marriage Hall Collapse, Wedding Venue Collapse Rajasthan, Rajasthan Wedding Accident, Wedding Mishap

23 dead, 28 injured after a wedding hall collapses in Rajasthan's Bharatpur district. District Magistrate N.K. Gupta said the incident was triggered due to a thunderstorm and rainfall.

పెళ్లిలో పెను విషాదం.. గోడ కూలి 23 మంది మృతి

Posted: 05/11/2017 08:05 AM IST
23 killed as wall at wedding venue collapses after heavy rain

మరికొద్ది క్షణాల్లో ఆ జంట కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. బంధువులు నవ్వుతూ.. తుళ్లుతూ.. సరదాగా నవ్వుతూ సందడి చేస్తున్నారు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ప్రకృతి రూపంలో మృత్యువు వాళ్లను విగతజీవులుగా మార్చి వేసింది. ఘోర ప్రమాదంలో 23 మంది దుర్మరణం పాలయ్యారు. సంబరంగా జరుగుతున్న వివాహ వేడుకలో ఒక్కసారిగా పెను విషాదం అలముకుంది.

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఓ పెళ్లి వేడుకలో ఘోరం జరిగింది. భరత్‌పూర్‌లోని అన్నపూర్ణ మ్యారేజీ గార్డెన్‌లో గోడ కూలి 23 మంది చనిపోయారు. అటవీశాఖా ఉద్యోగి కిరోరి మలి వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది. బంధువులంతా తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో 13 అడుగుల ఎత్తైన పెళ్లి మండపం గోడ ఒక్కసారిగా కూలిపోయింది.

శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 23 మంది విగత జీవులుగా మారిపోయారు. వీరిలో నలుగురు చిన్నారులు, 11 మంది మహిళలు ఉన్నారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఆరాతీసింది. క్షతగాత్రులకు సరైన వైద్య సదుపాయం అందించాలని, తక్షణమే నష్టపరిహారం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan  Wedding Hall Collapse  23 Died  

Other Articles