అధికారంలో వున్నంత కాలం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ ఒకే డైలాగ్ ను వల్లే వేసే నేతలు ప్రతిపక్షానికి పరిమితమైనప్పుడు కూడా అదే పోకడను అవలంభించకుండా.. ఏకంగా తమ పట్ల అమర్యాదగా వ్యవహరించారన్న కారణంతో ఏకంగా పోలీసు అధికారులపైనే దాడులకు దిగడం సభ్య సమాజం గర్హించే చర్యగా పేర్కోనక తప్పదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో అలాంటి ఘటనే నమోదైంది. ఇన్నాళ్లు అధికారంలో వున్న నేతలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నకలలో ఘోర పరాజయాన్ని చవిచూసినా.. గుణపాఠాలను నేర్చుకోవాల్సిన నేతలు.. తమ తీరును మార్చుకోకుండా ఏకంగా పోలిస్ స్టేషన్ లోనే పోలిస్ అధికారిపై దాడికి పాల్పడి అడ్డంగా మీడియాకు దొరికిపోయారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఈటాహ్ లో చోటుచేసుకుంది.
అసుపత్రిలో నానా రభస చేసి, అక్కడి సిబ్బందితో పాటుగా డాక్టర్లపై కూడా చేయిచేసుకున్నాడన్న అరోపణలపై ఉత్తర్ ప్రదేశ్ శాసనమండలి నేత రమేష్ యాదవ్ మేనల్లుడు మోహిత్ యాదవ్ ను పోలీసులు ఠాణాకు పిలిపించారు. అక్కడికి చేరుకోగానే నా పేరు మోహిత్ యాదవ్.. అంటూనే ఒక్కసారిగా అక్కడున్న పోలీసు అధికారి చెంప మీద కొట్టాడు నిందితుడు. పూర్తిగా మద్యం మత్తులో వున్న మోహిత్ యాదవ్ తాను ఏం చేస్తున్నాడన్న సృహకూడా లేకుండా ఏకంగా పోలీసు అధికారి దరోగా జితేంద్ర త్యాగిపై దాడికి పాల్పడ్డాడు.
కేవలం తనను స్టేషన్‌కు పిలిపించినందుకు మోహిత్ యాదవ్ కు ఎక్కడలేని కోపం వచ్చి ఈ పనికి పాల్పడినట్లు సమాచారం. వెంటనే తేరుకున్న ఎస్ఐ నిందితుడ్ని అడ్డుకున్నాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్కడున్న మిగిలిన పోలీసులు అతడిని పట్టుకుని ఆపేందుకు ప్రయత్నించగా, వాళ్లలో ఒకరి కాలర్ పట్టుకున్నాడు. దీంతో పోలీసు అధికారుల విధి నిర్వహణను అడ్డుకున్నందుకు మోహిత్ యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అయితే అంతకుముదు మోహిత్ యాదవ్ ఆస్పత్రికి వెళ్లి, తన బంధువుకు ఎక్స్‌రే తీయించుకోడానికి వీఐపీ పద్దతిలో చికిత్స కావాలని డిమాండ్ చేశాడు. వాళ్లను వెంటనే చూడాలని, క్యూలో వేచి ఉండేది లేదని అన్నాడు. అలా కుదరదని అక్కడి సిబ్బంది చెప్పడంతో అక్కడున్న ల్యాబ్ టెక్నీషియన్ ను కొట్టడంతో పాటు వైద్యుడిపై కూడా దాడి చేశాడు. ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు అతడిని స్టేషన్‌కు లాక్కెళ్లారు. తనను పోలిస్ స్టేషన్ కు తీసుకురావడంపై మండిపడ్డ మోహిత్ యాదవ్ ఎస్ఐ త్యాగిపై దాడి చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. అతడు పీకల వరకు తాగినట్లు తెలుస్తోందని సీనియర్ పోలీసు అధికారి సత్యార్థ్ అనిరుథ్ పంకజ్ చెప్పారు. అయితే ఈ ఘటన నుంచి తనకు తానుగా దూరం జరిగే ప్రయత్నం చేస్తున్నారు రమేష్ యాదవ్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more