Andhra MP Insulted by KCR Camp Office Staff

Amalapuram mp insulted by kcr staff

Pandula Ravindranath, Amalapuram MP, AP MP Insult KCR, KCR Staff Insult, Andhra MP insulted Telangana, Telangana CM Camp Office, KCR Protocal, MP KCR Camp Office, AP MP Insult, MP Ravindranath Insult, KCR Peshi, KCR Staff AP MP, AP MP KCR, Pandula Ravindranath Daughter Wedding

Andhra Pradesh Amalapuram MP Pandula Ravindranath faces bitter experience at KCR Camp Office. Not Allowing him into CM's Peshi.

కేసీఆర్ ఆఫీస్ వద్ద ఎంపీకి ఘోర అవమానం

Posted: 05/11/2017 08:28 AM IST
Amalapuram mp insulted by kcr staff

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు పొరుగు రాష్ట్రం ఆంధ్రలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉద్యమ సమయంలో విమర్శల సంగతి పక్కన బెడితే ఆ మధ్య నిర్వహించిన ది బెస్ట్ సీఎం పోల్ లో చాలా ఓట్లు అక్కడి నుంచి కూడా పడ్డాయి. ఏపీకి చెందిన పలువురు నేతలు కేసీఆర్, పథకాలు, పాలనను ఆకాశానికెత్తిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఇక తన దగ్గరికి వచ్చే అతిథుల విషయంలో మర్యాదలకు ఎలాంటి లోటు చేయడనే టాక్ కూడా ఉంది. వచ్చేది ఎవరైనా సరే ఆయన రిసీవింగ్ ఓ రేంజ్ లోనే ఉంటుంది మరి. కానీ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎంపీ విషయంలో మాత్రం అది చేదు అనుభవాన్నే మిగిల్చింది. సిబ్బంది అవగాహన రాహిత్యం మూలంగానే లేక మరేయితర కారణమో తెలీదుగానీ ఎండలోనే ఆయన చాలా సేపు ఎదురుచూసి వెనుదిరగాల్సి వచ్చింది.

అమలాపురం ఎంపీ రవీంద్రబాబు తన కుమార్తె వివాహానికి కేసీఆర్ ను ఆహ్వానించేందుకు ఆహ్వాన పత్రికను తీసుకుని బుధవారం క్యాంపు కార్యాలయానికి వచ్చాడు. అయితే సీఎం లేరని చెప్పిన భద్రతా సిబ్బంది, ఆయన్ని లోపలికి మాత్రం అనుమతించలేదు. సీఎం పేషీలో పెళ్లి కార్డు ఇస్తానని, తానో ఎంపీనంటూ ఐడీ కార్డు కూడా చూపించాడంట. అంతేకాదు తన వివరాలు చెక్ చేసుకోవాలంటూ అరగంట సమయం ఇచ్చాడంట. అయినా వాళ్లు పట్టించుకోకుండా ఎండలో మెయిన్ గేటు వద్ద ఆయన్ను ఆపేశారంట. తాను కేసీఆర్ పై అభిమానంతో పెళ్లికి పిలవాలని వచ్చానని, ఎంపీ అయిన తనకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించాడు. ప్రోటోకాల్ తెలియని భద్రతా సిబ్బంది కారణంగానే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని వాపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM KCR  Camp Office Staff  AP MP Insult  

Other Articles