AP's Banganapalle mango gets GI tag బంగినపల్లి మామిడి మనదే..! భవిష్యత్తు బంగారుబాటే..!!

Andhra pradesh s banganapalle mango gets gi tag

banganapalle, Banganappalle Mangoes, Geographical Indications Registry, Geographical Indication (GI), Andhra Pradesh, Telangana, Seal, rani kumudini, Nandyal, Kurnool, khammam, mahabubnagar, rangareddy, medak, Intellectual Property Rights, telugu states, telugu news, India news, latest news

The succulent Banaganapalle mango has got Geographical Indication (GI) registration from the Geographical Indications Registry. The AP government is the registered proprietor of the GI tag for mangoes, often hailed as "the king of fruits."

బంగినపల్లి మామిడి మనదే..! భవిష్యత్తు బంగారుబాటే..!!

Posted: 05/05/2017 11:55 AM IST
Andhra pradesh s banganapalle mango gets gi tag

పురుషులందు పుణ్య పురుషులు వేరయా..! అన్నట్లు మామిడి పండ్లను చూసిచూడాగానే నోరూరిస్తాయనడంలో సందేహమే లేదు. కానీ మామిడి పండ్లలో బంగినపల్లి మామిడి పండ్ల ప్రత్యేకత గురించి చెప్పనక్కర్లేదు. అయితే మా దెగ్గర కూడా మామిడి పండ్లు పండుతాయని అవి కూడా తియ్యగా వుంటాయని వాదనలకు తావు లేకుండా.. బంగినపల్లి మామిడి పండుకు పేటెండ్ రైట్స్ మనమే దక్కించుకున్నాం. అంటే బంగినపల్లి మామిడి పండుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ను అంధ్రప్రదేశ్ సాధించుకుంది. ఈ జియో ట్యాగ్ తో ఇక ఆంధ్రప్రదేశ్ మాత్రమే బంగినపల్లి మామిడికి అసలైన యజమానిగా రిజిస్టర్ అయ్యింది.

రుచిలో బంగినపల్లి మామికి ఏదీ సాటి లదేన్న విషయం తెలిసిందే. అంతేకాదు దాని తీయదనం కూడా మరేఇతర మామిడి పండుకు రాలేదన్నది కూడా దానిని అస్వాదించిన వారికి తెలియంది కాదు. అలాంటి బంగినపల్లికి ఇక ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. దీంతో, ఆంధ్రప్రదేశ్ లో పండే పంటగా ‘బంగినపల్లి’కి సర్వత్ర గుర్తింపు లభిస్తుంది. ‘బంగినపల్లి’కి జియో ట్యాగ్ విషయమై చెన్నైలోని ది రిజిస్ట్రార్ ఆఫ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ ఓపీ గుప్తా కు ఏపీ హార్టికల్చర్ శాఖ దరఖాస్తు అందించింది.

‘బంగినపల్లి’ పంటకు ప్రధాన కేంద్రంగా రాయలసీమలోని కర్నూలు, ఆ తర్వాత పాణ్యం, నంద్యాల మండలాలు గుర్తింపును సాధించాయి. 2111లో అప్పటి హార్టీకల్చర్ కమీషనర్ గా వున్న రాణి కుమిదిని ఇందుకు సంబంధించి అప్పుడే ఈ గుర్తింపు రావడానికి అన్ని పత్రాలను సిద్దం చేసి జియో ట్యాగ్ అధికారులకు పంపారు. అమె పంపిన పత్రాల ప్రకారం అంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోని ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, అదిలాబాద్ జిల్లాలు కూడా ఈ పంటను బాగా పండిస్తున్నాయని పేర్కొన్నారు.

అయితే తాజాగా ఈ పంట పండించే రెండో ప్రాంతంగా కోస్టల్ ఆంధ్రాను చేర్చుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన దరఖాస్తులో పేర్కొంది. అంతేకాకుండా, జియో ట్యాగ్ పొందేందుకు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించింది. దీంతో ఈ పంటను పండించే రైతులకు భవిష్యత్తులో మంచి ధరల వస్తాయని, వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయని కూడా రాష్ట్ర హార్టికల్చర్ శాఖ అభిప్రాయపడుతుంది. జియోట్యాగ్ పొండడం ద్వారా వ్యాపారపరమైన అంశాల్లో ప్రయోజనం ఉంటుందని ఆ శాఖ అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles