Hyderabad 22nd Place in Swachh Survekshan 2017

Swachh survekshan 2017 declared

Swachh Bharat Awards 2017, Swachh Survekshan-2017, Swachh Bharat Hyderabad, Hyderabad Dirtiest City, Dirtiest Cities in India, 2017 Swachh Bharat, Swachh Bharat Hyderabad, Swachh Bharat Vizag, Vizag Hyderabad, Hyderabad Swachh Bharat Rank , Indore Vizag Sawchh Bharat, Vishakapatnam Clean City

Swachh Bharat Awards 2017. Indore tops as the cleanest city; Gujarat most improved state with 12 in top 50 list. Visakhapatnam 3rd Place and Hyderabad 22nd in List.

గబ్బులో మన ర్యాంక్ ఎంతో తెలుసా?

Posted: 05/04/2017 12:13 PM IST
Swachh survekshan 2017 declared

అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పుకునే తెలంగాణ పరిస్థితి శుభ్రతలో మాత్రం చాలా దారుణంగా ఉంది. కేంద్రం విడుదల చేసిన స్వచ్ఛ భారత్ ర్యాంకుల్లో ఆ విషయం తేటతెల్లమైంది. పట్ణణాభివృద్ధి శాఖ నిర్వహించిన సర్వేలో చెత్త ప్రాంతంగా భాగ్యనగరం విరజిల్లింది. ఈ స్థానంలో ఏపీ పరిస్థితి మెరుగ్గా ఉండటం విశేషం.

స్వచ్ఛ్ సర్వేక్షణ్ పేరటి 2017కు గానూ అత్యంత క్లీన్ సిటీస్ పేరిట విడుదల చేసిన ర్యాంకుల్లో మధ్య ప్రదేశ్ కు చెందిన ఇండోర్ తొలి ర్యాంకును కైవసం చేసుకుంది. గత ఏడాది తొలి స్థానంలో ఉన్న మైసూరు ఐదో స్థానానికి పడిపోయింది. హైదరాబాద్ 22వ స్థానంలో నిలవగా, వైజాగ్ క్లీన్ సిటీ జాబితాలో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర నగరాల్లో తిరుపతి (9), విజయవాడ (19), వరంగల్ (28), కాకినాడ (43), సిద్ధిపేట (45), రాజమండ్రి (46) స్థానాలను కైవసం చేసుకున్నాయి.

మెట్రో నగరాట్లో మాత్రం హైదరాబాద్ కు మొదటి స్థానం దక్కింది. గతేడాది ఈ లిస్ట్ లో 17వ స్థానంలో ఉండటం విశేషం. అత్యంత చెత్త రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్ రికార్డు కైవసం చేసుకోగా మోదీ నియోజకవర్గం వారణాసి మాత్రం క్లీన్ సిటీ జాబితాలో నిలవటం విశేషం.

2014 లో గాంధీ 150వ జయంతి వేడుకల సందర్భంగా స్వచ్ఛ్ భారత్ అభియన్ ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. 2019 నాటికి చెత్త రహిత దేశంగా భారత్ ను తీర్చిదిద్దాలన్నదే ఈ పథక ముఖ్య ఉద్దేశ్యం. నగరాల్లో ఉండే పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు, బహిరంగ మలమూత్ర విసర్జన ఏర్పాట్లు, రవాణా వ్యవస్థ, చెత్త నిర్వహణ అంశాల ప్రాతి పదికన ఈ ర్యాంకులను ప్రకటిస్తుంది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swachh Bharat  Swachh Survekshan 2017  Hyderabad  Vizag  

Other Articles