Government Admits Aadhaar Data Leak

Centre admits aadhaar leak

Aadhaar Data Leak, Aadhar Leakage Scam, Aadhar and Bank Accounts Data Leak, Aadhar Leak Scam, Government Agencies Aadhar, Aadhar Not Safe, Aadhar Data Leak, UIDAI Aadhar Leakage, Supreme Court UIDAI, Aadhar PAN Link

Aadhaar Data Leakage Centre to Supreme Court. Data Leaked From Government Agencies but not from UIDAI.

ఆధార్ అలా మాత్రం లీక్ కాలేదు

Posted: 05/04/2017 11:04 AM IST
Centre admits aadhaar leak

ఆధార్‌ కార్డుల లీక్‌కు సంబంధించి కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చింది. ఆధార్ డేటా లీక్ అయ్యే ఛాన్సే లేదని బుకాయిస్తూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు దానిని అంగీకరించింది. ప్రభుత్వ తరపున న్యాయవాది ఆర్గ్య సేన్ గుప్తా ఈ మేరకు సుప్రీం కోర్టు బెంచ్ ముందు విషయాన్ని వెల్లడించాడు. పత్రికల్లో వచ్చిన కథనాలు వాస్తవమేనని ఆయన అంగీకరించాడు.

ప్రభుత్వ శాఖల్లో రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీల ద్వారా ఈ లీకేజీ జరిగిందని ఒప్పుకున్న ఆయన కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చని చెప్పటం విశేషం. హనుమంతుడి పేరుతో, కుక్కల పేరుతో కార్డులు జారీ అయినప్పటికీ, యూఐడీ ఇప్పటికీ కచ్చితమైన బయోమెట్రిక్‌ వ్యవస్థే’ అని ప్రభుత్వ న్యాయవాది వివరించాడు. ప్రభుత్వ సేవలకు అసలైన లబ్ధిదారులకు అందించేందుకు ఆధార్‌ ఉపయోగపడుతుందన్నారు.

ఇక పాన్‌ నంబర్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని సుప్రీం కోర్టులో పిటిషనర్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నిర్ణయం ఆధార్‌ స్వచ్ఛందమేనన్న ఆధార్‌ చట్టబద్ధ విభాగం విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) నిబంధనలకే పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. ‘ప్రభుత్వ నిర్ణయం పౌరహక్కులను నీరుగారుస్తుంది. వారిపై ఆధిపత్యం చలాయిస్తూ వ్యక్తుల గోప్యతను దెబ్బతీసి, జీవితాంతం వారిపై నిఘా ఉంచుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశమమని చెప్పుకునే ఏ దేశమూ ఆధార్‌లాంటి వ్యవస్థను అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ఆధార్‌ కార్డుదారుల వివరాలను ప్రైవేటు సంస్థలు సేకరిస్తున్నాయని, వాటిని దుర్వినియోగం, లీక్‌ చేసే అవకాశముందని పిటిషనర్ల తరపు న్యాయవాది శ్యామ్‌ దివన్‌ అన్నారు.

పదే పదే కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ తాజా పరిశోధన మాత్రం భద్రతా వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. జార్హండ్‌ లీక్‌ వ్యవహారం మర్చిపోకముందే ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మరోభారీ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుమారు 14కోట్లు (13కోట్ల 5లక్షల) ఆధార్‌కార్డులు, పదికోట్లకు పైగా బ్యాంకు ఖాతాల సమాచారం లీక్‌అయిందని తాజా రిపోర్ట్‌ వెల్లడించింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది.

ఏపీ డేటా కూడా...

ఏపీ కి చెందిన రాష్ట్ర ప్రభుత్వ సొంత ఎన్ఆర్ఇజిఎ పోర్టల్ , రాష్ట్ర ప్రభుత్వ పథకానికి సంబంధించిన ఆన్లైన్ డాష్‌ బోర్డ్‌ "చంద్రన్న బీమా" ది. ఈనాలుగు పోర్టల్స్‌ దవ్ఆరా 130-135 మిలియన్లదాకా ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే వంద మిలియన్లు(కోటి) దాకా బ్యాంక్‌ ఖాతా నెంబర్లు బహిర్గతమయ్యాయని అధ్యయన వేత్తలు అంబర్‌ సిన్హా , కొడాలి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ డేటా లీక్‌ లో యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) పాత్రపై విశేషంగా ప్రస్తావించారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aadhar Data Leak  Givernment  UIDAI  

Other Articles