VH Defends Digvijay Singh over ISIS Claim

V hanumantha rao defends digvijay singh over isis remark

VH Digvijay Singh, V Hanumantha Rao, Digvijay Singh Telangana Police, Digvijay Singh ISIS Claim, Telangana Police ISIS, V Hanumantha Rao Governor Narasimhan, VH Defends Digvijay Singh, VH KCR, VH Farmers Issue, Digvijay Singh Allegations, VH Support Digvijay Singh, Telangana Police VH

Congress Senor Leader V Hanumantha Rao backs Digvijay Singh Allegations. Telangana Government should prove Innocence on Digvijay Singh's ISIS claim VH added.

దిగ్విజయ్ కామెంట్స్ కు గట్టి సపోర్ట్ దొరికింది

Posted: 05/03/2017 04:33 PM IST
V hanumantha rao defends digvijay singh over isis remark

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పోలీసులపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వేడి ఇంకా తగ్గలేదు. షాజాపూర్‌ జిల్లాలో బాంబు పేలుళ్లు, కాన్పుర్‌లో సైఫుల్లా ఎన్‌కౌంటర్‌పై తాము సమాచారం అందించకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని డీజీపీ కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తెగేసి చెప్పటం చూశాం. మంత్రుల దగ్గరి నుంచి కింది స్థాయి నేతల దాకా అంతా డిగ్గీ రాజాపై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత వీ హన్మంతరావు స్పందించాడు.

తమ పార్టీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి దమ్ముంటే, ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలని సవాల్ విసిరాడు. చాలా మందితో మాట్లాడి అధ్యయనం చేసి ఆధారాలు సేకరించిన తర్వాతే దిగ్విజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పుకొచ్చాడు. ముస్లిం యువతను ట్రాప్‌ చేయడం నైతికంగా ఏమాత్రం సమర్థనీయం కాదన్న వీహెచ్, ఆరోపణల్లో అవాస్తవాలను తేల్చాల్సిన అవసరం ప్రభుత్వంపైనే ఉందని చెప్పాడు. తెలంగాణ పోలీసుల వ్యూహం ఏదైనా కావచ్చుగానీ నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి ఐసిస్‌ వైపు ఆకర్షితులయ్యే ముస్లిం యువతను గుర్తించే విధానం సరికాదన్నాడు.

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, బీసీలకు ఆయన విలువ ఇవ్వడం లేదని, జ్యోతిరావ్ పూలే జయంతి నాడు ఆయనకు పూలదండ కూడా వేయలేదని ఆరోపించారు. ఖమ్మం మార్కెట్ యార్డు సంఘటనను ఉద్దేశించి దళారుల ప్రభుత్వంగా అభివర్ణించాడు. విద్యార్థుల దగ్గరికే కాదు.. కనీసం రైతుల వద్దకు కేసీఆర్ వెళ్లలేని స్థితికి చేరుకున్నాడని ఎద్దేవా చేశాడు. పనిలో పనిగా గవర్నర్ నరసింహన్ పదవీకాలం పొడిగింపుపై ఆయన వ్యాఖ్యలు చేశారు. నరసింహన్ గవర్నర్ గా ఉన్నంత కాలం రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగదని, ఈ విషయమై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాస్తానని వీహెచ్ చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Digvijay Singh  Telangana Police  ISIS Claim  V Hanumantha Rao  

Other Articles