Groom Arrested For Hiring Fake Wedding Guests ప్రేమ ఎంత మదురం.. ప్రియురాలు అంత కఠినం..

Groom hires fake guests for wedding defrauds bride s family

fake guest, fake wedding guests, hired guests, hired friends, groom wang hired friends, wedding disaster, china groom behind the bars on wedding day, groom cheated bride, groom defrauded bride, fake friends, taxi drivers, Shaanxi, China, Eastern Asia, Asia, New York Post Company, Wang

A GROOM in China hired hundreds of people to pose as friends at his wedding because he was ashamed his real ones weren’t rich enough, according to reports.

ప్రేమ ఎంత మదురం.. ప్రియురాలు అంత కఠినం..

Posted: 05/03/2017 03:32 PM IST
Groom hires fake guests for wedding defrauds bride s family

ప్రేమ ఎంత మదురం ప్రీయురాలు అంత కఠినం పోగోట్టుకున్నాను ధనం.. అరువు తెచ్చినాను బంధు జనం అంటూ పాటలు పాడుకోవడమే అ వరుడికి మిగిలింది. అదేంటి పెళ్లి చేసుకున్నాడు మరి విరహవేదన దేనికి అంటారా..? డీటైల్స్ లోకి వెళ్లే ముందు కాస్త లవ్ స్టోరి చూచాయగా తెలుసుకుంటూ.. తాను గత మూడేళ్లుగా ప్రమేలో వున్న ప్రేయసితోనే వివాహం జరిగింది. అయినా వరుడు మాత్రం కటకటాల వెనక్కి వెళ్లి ఇదే పాటను అలసిస్తున్నాడు.

ఆ యువతి అతని మనసు దోచుకుంది. అమెతో మూడేళ్లుగా ప్రేమ కూడా నడిపిస్తున్నాడు. తీరా ఒకరోజు అమెకు కూడా విషయాన్ని చెప్పాడు. అయితే అమె కూడా అతన్ని ఇష్టపడింది. ఇక్కడే పెద్ద చిక్కువచ్చిపడింది. తాను పెళ్లికి అంగీకరించాలంటే తన తల్లిదండ్రులు కూడా అందుకు సమ్మతించాలని, లేని పక్షంలో తాను నిరభ్యంతరంగా తనను వదులుకుంటానని కూడా యువతి చెప్పింది. అందుకు ఒక చెప్పిన యువకుడు.. యువతిని మోసం చేసైనా తనదానిని చేసుకోవాలని అనుకున్నాడు. అంతే అనంత కష్టాలు తెచ్చుకుని కటకటాల్లో అలమటిస్తున్నాడు.

వివరాల్లోకి వెళ్తే చైనాలోని షాంజీ ప్రావిన్సులలో జరిగిన ఈ ఘటన చోటుచేసుకుంది. వాంగ్‌ అనే యువకుడు గత మూడేళ్లుగా ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే అమెను పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాడు. ఇకనేం అంతా శుభమే కదా అని అనుకుంటున్నారా..? అయితే అందుకు ప్రియుడి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అక్కడే అసలు చిక్కు వచ్చింది. దీంతో వారు అంగీకరిస్తేనే తమ పెళ్లి జరుగుతుందని ప్రియురాలు ప్రియుడికి తేల్చిచెప్పింది. వారిని ఒప్పించే పూచీ తీసుకున్న ప్రియుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో అమెను మోసం చేశాడు. అదేంటీ ఏం చేశాడు అంటారా..?

తన తల్లిదండ్రులు కూడా వివాహానికి అంగీకరించారని, వారు కూడా వివాహ సమయానికి వస్తున్నారని చెప్పి పెళ్లికి ముహూర్తాలను పెట్టుకున్నారు. దీంతో వివాహ ముహూర్తం సమీపించింది. కళ్యాణ మంటపంలో 200 మంది బంధువులు, స్నేహితులు సందడి చేశారు. అయినప్పటికీ వధువు తన అత్తమామలు కనిపించడం లేదంటూ వరుడిని నిలదీసింది. వారు వస్తున్నారని నానా కథలు చెప్పి తప్పించుకున్న వరుడు.. మొత్తానికి మేనేజ్ చేసి వివాహ తంతును పూర్తి చేసుకున్నాడు. అక్కడే అసలు ట్విస్టు ప్రారంభమైంది.

వధువు సోదరి సరికొత్త విషయం తెలిసింది. తమ సోదరి వివాహానికి వచ్చిన అతిధులందరూ కేవలం బడులకు వెళ్లని యువకులు, టాక్సీ డ్రైవర్లు, ఇక కొందరు మాత్రం నాటకాలు వేసేవాళ్లని, అయితే వీళ్లలో నిజంగా వరుడికి బంధులంటూ మాత్రం ఎవరూ లేరని కూడా తెలుసుకుంది. అంతే అఘమేఘాల మీద అక్క చెంతకు వెళ్లి విషయాన్ని చెప్పింది. పెళ్లికి వచ్చిన బంధువులంతా అద్దెకు వచ్చినవారేనని తెలిపింది.

తమ పెళ్లికి రావాలని, అలా వచ్చి తమ బంధవుల్లా నటించేందుకు ఒక్కోక్కరికి బోజనంతో పాటుగా పది నుంచి పన్నెండు డాలర్లు ఇస్తానని వరుడు వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడని, దీంతో వారంతా ఈ వివాహానికి హాజరయ్యారని వధువకు అమె సోదరి చెప్పింది. అంతే, వివాహం ముగిసీముగియగానే అందరిముందు వరుడు వాంగ్ ను వధువు నిలదీసింది. అతడు ఔనన్న సమాధానమే చెప్పాడు. అంతే తీవ్ర ఆగ్రహానికి గురైన వధువు... అక్కడికక్కడే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వరుడన్ని అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోశారు. తన తల్లిదండ్రులకు ఎంతగా విన్నవించినా.. అంగీకరించలేదని, దీంతోనే తాను ఇలా చేయాల్సి వచ్చిందని వాంగ్ వాపోతున్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china bride  groom  wang  shaanxi  china  hired friends  fake guests  police  

Other Articles