Baby Elephant Being Thrown Around By Bull చిన్న ఏనుగును ఎత్తి కుదేసిన పెద్ద గున్న ఏనుగు

Baby elephant tossed around after getting in the way of a bull

baby elephant, tiny tusker, baby elephant tossed aside, bull elephant, Addo Elephant National Park, South Africa, animal video, Jeni Smithies, nature guide, Lloyd Carter, photographer, viral video

Dramatic footage captures the moments a baby elephant wails after being tossed around by a bull elephant in the Addo Elephant National Park in South Africa.

ITEMVIDEOS: చిన్న ఏనుగును ఎత్తి కుదేసిన పెద్ద గున్నేనుగు..

Posted: 05/03/2017 02:10 PM IST
Baby elephant tossed around after getting in the way of a bull

మొక్కై వంగనిది మ్రానే వంగునా అన్న పెద్దల సామెత గుర్తుందా..? కానీ నేటి తరం తల్లిదండ్రులు పిల్లల విషయంలో అలాంటి జాగ్రత్తను తీసుకోవడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. పిల్లలను మరింత సున్నితంగా పెంచడంతో పాటు వారిని సన్మార్గంలో కూడా పెట్టలేక పోతున్నారు. ఈ విషయంలో మనబిడ్డలే అయినా కటువుగా వుండక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఓ పిల్ల ఏనుగు తన దారిలో తాను వెళ్లకుండా తన దారిలో అడ్డుగా వచ్చిందని ఊగిపోయిన గున్నఏనుగు ఏం చేసిందో తెలుసా..?

ఏనుగులు మందలుగా వుంటాయి. తమ కుటుంబాలతో ఉమ్మడి మందల్లో మాత్రమే సంచరిస్తాయి. ఒకవేళ శత్రువు ఎవరైనా వచ్చినా మందను చూడగానే వెనక్కి వెళ్తారే తప్ప వాటిని వేటాడే ధైర్యం మాత్రం చేయవు కాబట్టి. అయితే తన దారిన తాను నడవకుండా.. అడ్డువచ్చిందన్న కోపంతో ఓ పిల్ల ఏనుగుని పెద్ద ఏనుగు ఏకంగా గాల్లోకి ఎత్తి కుదేసింది. ఇప్పుడు ఈఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. గుంపులుగా వెళుతున్న ఏనుగుల్లో నుంచి ఓ గున్న ఏనుగు ప‌క్క‌కు జ‌రిగింది.

దీంతో పక్క దారిలో వెళ్తున్న గున్న ఏనుగుపై కోపం తెచ్చుకున్న పెద్ద ఏనుగు దాన్ని తొండంతో లేపి పడేసింది. చివరికి ఆ గున్న ఏనుగు బుద్ధి తెచ్చుకొని స‌రైన దారిలో న‌డ‌వ‌డంతో వ‌దిలేసింది. ఇలా ఒకటి కాదు మూడు పరయ్యాలు చేసింది. అయితే దానినిని నిమరబోయిన అడ ఏనుగుపైకి కూడా అలా విరుచుకుపడేందుకు మగ ఏనుగు వెళ్లింది. అయితే అది కాస్తా విరహపిసాసిలా మారడంతోనూ అలా చేసిందని పలువురు నెట్ జనులు కామెంట్లు పెట్టారు. దక్షిణాఫ్రికాలోని అడ్డో నేషనల్ పార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles