Governor ESL Narasimhan's tenure extends తెలుగు రాష్ట్రాలకు సింహం సేవల పోడగింపు

Telugu states governor esl narasimhan tenure extends

ESL Narasimhan tenure temporarly extended, narasimhan tenure extended, K Chandrasekhar Rao, Andhra Pradesh Governor, Telangana Governor, telugu states Governor, Union home ministry, Rajnath singh

The tenure of Governor of both Telugu states - Andhra Pradesh and Telangana ESL Narasimhan is extended by union home ministry untill furthur orders.

తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు తెలుగు రాష్ట్రాలకు నరసింహమే..!

Posted: 05/02/2017 09:13 PM IST
Telugu states governor esl narasimhan tenure extends

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న అనేక వివాదాస్పద అంశాలను తన అనుభవంతో అత్యంత చాకచక్యంగా పరిష్కరించిన గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ పదవీకాలాన్ని కేంద్రం తాత్కాలికంగా పొడిగించింది. ఇప్పటికే తమకు గవర్నర్ నరసింహన్ సేవలను కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కాగా మరో తెలుగు రాష్ట్రమైన అంధ్రప్రదేశ్ లో అధికారంలోని వున్న చంద్రబాబు సర్కార్ ఈ మేరకు త్వరలో కేంద్రాన్ని కోరుతూ ఉత్తర్వులు జారీ చేయనుందని సమాచారం.

అయితే ఈలోగా గవర్నర్ నరసింహన్ పదవీకాలాన్ని కేంద్రప్రభుత్వమే తాత్కాలికంగా పోడగించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మౌఖిక అదేశాలను ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ గవర్నర్‌గా కొనసాగాలని నరసింహన్ ను ఆదేశించింది. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య మరిన్నీ వివాదాస్పద అంశాలు అపరిష్కృతంగా వున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించేంత వరకు నరసింహన్ ను  గవర్నర్ గా కోనసాగించాలని కేంద్రం భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది.

తమిళనాడుకు చెందిన నరసింహన్‌ 2007 జనవరి 25న తొలిసారి ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2010 జనవరిలో బదిలీపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. 2012 మే 3న మొదటి విడత పదవీకాలం ముగిసింది. కేంద్రం మళ్లీ ఇక్కడే నియమించింది. మంగళవారంతో ఆయన మూడో విడత పదవీకాలమూ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాత్కాలిక పొడగింపు ప్రకటించింది. జులైలో రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో నరసింహన్‌ను కొనసాగించే అవకాశాలే ఎక్కువ ఉంటాయని రాజకీయ వర్గాలు భావించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles