తెగువ చూపిన భారతీయుడికి అమెరికా పోలీసుల రివార్డు.. indian samaritan rewarded by edison police

Police reward samaritan robbed rescuing woman from train tracks

anil vannavalli, Manhattan, Indians abroad, Indian-origin, Edison, indian saved co worker robbed, edison police reward to indian samaritan, indian samaritan rewarded

The Edison Police Union awarded a Piscataway man with a $1,000 cheque after he was robbed while saving a woman from an oncoming train.

తెగువ చూపిన భారతీయుడికి అమెరికా పోలీసుల రివార్డు..

Posted: 05/02/2017 05:52 PM IST
Police reward samaritan robbed rescuing woman from train tracks

ప్రమాదంలో చిక్కుకున్న మహిళను సజీవంగా కాపాడటంతో తెగువను ప్రదర్శించిన అనీల్ వన్నవల్లి పేరు అటు అమెరికా ఇటు భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ధ్వనిస్తుంది. అయన ధైర్యసాహసాలను ప్రశంసిస్తుంది. ఈ నేపథ్యంలో తాను దోపిడికి గురికావడంపై స్పందించిన ఎడిసన్ పోలీసులు అనీల్ వన్నెవల్లికి వెయ్యి డాలర్ల పారితోషకాన్ని అందించారు. అనీల్ ప్రదర్శించిన ధైర్యసాహం కారణంగా బాధితురాలు కేవలం గాయాలతో బయటపడిందని, అలా కాని పక్షంలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా విషాదకరంగా వుండేవని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వార్త వివరాల్లోకి వెళితే..
 
అనిల్ వన్నవల్లి (34) అనే భారతీయుడు న్యూయార్క్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. మాన్ హట్టన్ లోని తన కార్యాలయానికి వెళ్లేందుకుగానూ ఎడిసన్ స్టేషన్ కు వెళ్లాడు. అనిల్ తోపాటే తన కార్యాలయంలో పనిచేసే మాధురి రేచర్ల అనే యువతి కూడా అదే సమయంలో ఎడిసన్ స్టేషన్ కు వచ్చింది. రైలు వస్తున్న క్రమంలో అకస్మాత్తుగా మాధురి సృహకోల్పోయి.. రైలు పట్టాలపై పడిపోయింది. ఇది గమనించిన అనిల్.. తన భుజానికున్న బ్యాగును ఫ్లాట్ ఫాంపై పెట్టి, ఆమెను కాపాడేందుకు పట్టాలపైకి దూకి అమెను తన చేతుల్లోకి తీసుకుని పక్కకు తీసుకువచ్చాడు. ఆ తరువాత రైలు రావడం.. వెళ్లిపోవడం జరిగింది. ఇది గమనించిన మరికోందరు యువకులు అనీల్ కు సాయపడ్డారు.

గడచిన రెండు రోజులుగా అహారం తీసుకోకపోవడంతో తాను సృహకోల్పోయానని అప్పటికే అక్కడకు చేరుకున్న ఎడిసన్ పోలీసులకు మాధురి తెలిపింది. అయితే రైలు పట్టాలపై పడటంతో అమె మోకాలు, మడమల్లో ప్రాక్చర్ కావడంతో. అమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు పోలీసులు. ఇదిలావుండగా, సందెట్లో సడేమియాలా.. అమెరికాలో అదీ ఓ యువతి ప్రాణాలను కాపాడేందుకు సాహసం చేసిన అనీల్ బ్యాగ్ ను అక్కడి చోరులు తస్కరించారు. అందులో విలువైన ల్యాప్ టాప్, కొంత డబ్బు, ఐడీ కార్డులు ఉన్నాయి. దీంతో పోలీసుల గోఫండ్ మీ పేజీని తెరవడంతో పాటు అనీల్ తెగువకు మెచ్చి.. వెయ్యి డాలర్ల పురస్కారాన్ని అందించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anil Vannavalli  Madhuri Recherla  Edison Police Chief  Thomas Bryan  edison  manhattan  US  

Other Articles