Petrol Pump 'Vanished' in UP's Lucknow ధర్నా చేపట్టనున్న పెట్రోల్ బంకు యజమానులు

Petrol pump owners go on strike following raids by stf

CM Yogi Adityanath, lucknow, petrol pump cheat, petrol pump strike, stf raids, uttar pradesh, strike, owner, lucknow stf, up petrol pump association, uttar pradesh stf, chief minister yogi adityanath, chips in petrol pumps, bunk vanished, lucknow police raids

The Lucknow petrol pump owners strike came after raids at petrol pumps by Uttar Pradesh STF after orders from Chief Minister Yogi Adityanath

ధర్నా చేపట్టనున్న పెట్రోల్ బంకు యజమానులు

Posted: 05/02/2017 12:14 PM IST
Petrol pump owners go on strike following raids by stf

ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన బీజేపి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ చుక్కలు చూపెడుతుండగా, దానిని ధీటుగా ఎదుర్కోనేందుకు ఇటు పెట్రోలు బంకులు యజమానులు కూడా సిద్దమవుతున్నారు. పెట్రోలు బంకుల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నాయని తెలుసుకున్న ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సదరు బంకులపై అకస్మిక దాడులు చేయాలని అదేశాలు జారీ చేసిన నేపథ్యంలో యాజామాన్యాలు ధర్నాకు దిగి నిరసనను తెలుపుతున్నాయి. దీంతో ఉత్తర్ ప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం.. యాజమాన్య ప్రతినిధులతో ఎట్టకేలకు చర్యలు చేపట్టింది.

అయితే పెట్రోలు బంకుల యజమానులు చిప్ లాంటి పరికరాన్ని పెట్రోల్ పోసే మిషన్లో ఏర్పాటు చేసి.. తక్కువ మొత్తంతో పోసిన పెట్రోలుకు అధిక మొత్తం వసూళ్లు చేస్తుండటంతో.. ఈ బాగోతం బట్టభయలైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పెట్రోల్ బంకులపై దాడులు చేసిన ఏకంగా 13 పెట్రోల్ బంకులను సీజ్ చేయగా, మరో రెండింటికి మాత్రం పెనాల్టీ వేశారు. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో అనేక చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

దాడులు జరుగుతున్నాయన్న విషయాన్ని కొద్ది నిమిషాల ముందుగానే తెలుసుకున్న ఓ పెట్రోలు బంకు యజమానీ ఏకంగా పెట్రోలు పోసే యంత్రపరికరాన్ని దాచేసి బంకు పునర్నిర్మాణంలో వుందని బోర్డు పెట్టేశాడు. అయితే ఎస్టీఎప్ అధికారులు దానిని పసిగట్టి.. ఇలాంటి 'పునర్నిర్మాణంలో ఉన్న' పలు బంకులమీద కూడా దాడులు చేశారు. గత వారం రోజులుగా లక్నో పోలీసులు జరుపుతున్న దాడుల్లో వెయ్యి కన్నా అధికంగానే చిప్‌లు బయటపడ్డాయి. తద్వారా రోజుకు రూ. 15 లక్షల విలువైన పెట్రోలును బంకుల యాజమాన్యాలు చోరీ చేస్తున్నట్లు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol bunks  chips in petrol pumps  bunk vanished  lucknow police raids  

Other Articles