TV Actress Harassed By Car Drivers వర్థమాన నటిపై అత్యాచార యత్నం..

Kannada tv actress harassed by car drivers

benguluru, kannada tv actress, tv actress harassed by drivers, kanada tv actress, molestation, heggena halli, bangalore city, rajagopalanagar police, sandalwood, sachin, praveen, celebrities, movies, music, headlines, gossips, news, bollywood, tollywood, kollywood, mollywood, India news, latest news

Bangalore film nagar reveal that a TV actress has been harassed when she is heading home after completion of the film’s shoot. The incident has taken place near Heggena Halli cross in the Bangalore city.

మరో దారుణం: వర్థమాన నటిపై లైంగిక వేధింపులు..

Posted: 05/02/2017 01:17 PM IST
Kannada tv actress harassed by car drivers

మాలీవుడ్ సహా దక్షిణాది చిత్రాలలో నటించిన నటి భావనపై అమె కారు డ్రైవర్ జరిపిన అఘాయిత్యాలను ఇంకా సీనీపరిశ్రమలోని నటీమణులు మర్చిపోకముందే.. మరో దారుణానికి ఒడిగట్టబోయారు మరో నటి కారు డ్రైవర్లు. అయితే నటి తీవ్రంగా ప్రతిఘటించడం.. అరుపులు కేకలు వేయడంతో.. వారు అమెపై దాడి చేసి పరారయ్యారు. తనకు పరిచయమున్న ఇద్దరు డ్రైవర్లు తనపట్ల అనుచితంగా వ్యవహరించి పైశాచిక మృగాళ్లా.. అఘాయిత్యానికి పాల్పడబోవడంతో అమె వారిపై పోలీసులకు పిర్యాదు చేసింది.

బెంగళూరు రాజగోపాలనగర ఠాణా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కన్నడ సినీ పరిశ్రమతో పాటు ఇటు బుల్లితెరపై కూడా రాణిస్తున్న వర్ధమాన నటి (23).. సినిమా షూటింగ్ ముగించుకున్న తరువాత ఇంటికి తిరిగివెళ్లేందుకు అద్దె కారును బుక్ చేసింది. కాగా కారు హెగ్గనహళ్లి వద్దకు చేరుకోగానే కారులో వున్న ఇద్దరు డ్రైవర్లు.. మార్గమద్యంలో అపివేసి.. తమతోనే ఈ రాత్రి గడపాలని బలవంతం చేసి వారిద్దరూ అమె చోరో చేతిని పట్టుకుని బలవంతంగా లాక్కేళ్లే ప్రయత్నం చేశారు.

డ్రైవర్ల వక్రబుద్ది ఆకస్మికంగా బయటపడంతో.. వారిని అమె తీవ్రంగా ప్రతిఘటించింది. అరుపులు, కేకలు వేయడంతో ఇక మరోమార్గంలో లేక అమెపై దాడి చేసి, అసభ్యపదజాలంతో దూషిస్తూ వారు అక్కడి నుంచి జారుకున్నారు. దీంతో వారు తనపట్ల అసభ్యంగా వ్యవహరించడంతో వారిపై సదరు నటి పోలీసులకు పిర్యాదు చేసింది. కాగా సచిన్, ప్రవీణ్ అనే ఇద్దరు కారు డ్రైవర్లో నటికి మూడేళ్లుగా పరిచయం ఉందని సమాచారం. వారి వేధింపులతో గతంలో ఆత్మహత్యాయత్నం కూడా చేశానని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆమె తమకు కొంత డబ్బు బాకీ ఉందని, తాము అడగడంతో తమపై ఆరోపణలు చేస్తోందని వారిద్దరూ చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles