Legal notice to Navjot Singh Sidhu for advertisement

Punjab hc slams siddhu for appearance in ad

Navjot Singh Sidhu, Navjot Singh Sidhu Advertisement, Punjab Minister Navjot Singh Sidhu, Navjot Singh Sidhu Kpail Sharma, Navjot Singh Sidhu Vulgar Jokes, Captain Amarinder Singh Sidhu Ministry, English Learning Device Ad Navjot Singh Sidhu, Sidhu New Ad, Sidhu Legal Notice, Sidhu Punjab High Court

Punjab High Court has rapped Minister Navjot Singh Sidhu, for promoting an English language learning device. The court has lashed out at the minister and has asked him to respond to the notice.

సిద్ధూ చేసేది ముమ్మాటికీ పెద్దతప్పే!

Posted: 05/02/2017 08:02 AM IST
Punjab hc slams siddhu for appearance in ad

మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూకి మరిన్ని కష్టాలు తోడయ్యాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సిద్ధూపై సీరియస్ అయ్యింది. ‘‘యంత్రాన్ని కొంటే ఇంగ్లిష్ ఇట్టే వచ్చేస్తుంది’’ అంటూ ఓ యాడ్ లో నటించటంపై మొట్టికాయలు వేసింది. సాక్షాత్తూ ఓ మంత్రి అయి ఉండి ప్రజలను తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తారా? అంటూ నిలదీసింది.

ఇక కపిల్ శర్మ కామెడీ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సిద్ధూ అసభ్యకరమైన జోకులు వేస్తున్నారంటూ ఇప్పటికే పిటిషన్ దాఖలైంది. ఈ షో నుంచి తప్పుకోవాలని సిద్ధూను ఆదేశించాల్సిందిగా అరోరా అనే న్యాయవాది ఛండీగఢ్ హైకోర్టును ఆశ్రయించారు. సిద్ధూ వేసే అర్థంపర్థం లేని జోకుల వల్ల పంజాబ్ ప్రతిష్ఠ దిగజారుతోందని, మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్‌కు ఆ న్యాయవాది లేఖ రాశాడు. ఇక ఇప్పుడు సిద్ధూ వాణిజ్య ప్రకటనల్లో నటించడంపై ఆయన మరో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు స్పందించింది.

ప్రతీది చట్టం పరిధిలో జరగాల్సిన అసరం లేదు. కానీ, వాటిని గౌరవించాల్సిన అవసరం ఉంది. మంత్రిగా ఉండి మీరే ఇలా చేస్తే.. మీ కింద పని చేసేవారు మిమల్ని ఆదర్శంగా తీసుకోరా? అంటూ సిద్ధూపై కోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. తక్షణమే దీనిపై వివరణ ఇవ్వాలంటూ లీగల్ నోటీసు జారీ చేసింది. ఇదిలా తనపై వెల్లువెత్తుతున్న విమర్శలు, ఆరోపణలపై సిద్ధూ మాట్లాడుతూ అనధికారికంగా తానేం చేసినా ప్రశ్నించే అర్హత బయటి వ్యక్తులకు లేదన్నారు. మంత్రిగా, టీవీ వ్యాఖ్యాతగా రెండు పనులకు తాను న్యాయం చేస్తున్నానని స్పష్టం చేశారు.

ఇక ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. మంత్రి పదవికి భంగం కలిగించేలా ఆయన (సిద్ధూ) వ్యవహరించినట్లు తేలితే ఆయనపై చర్యలు తప్పవని హెచ్చరించాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సిద్ధూ సదరు షోల నుంచి బయటకు వచ్చేస్తాడా? చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Punjab  Minister Navjot Singh Sidhu  Advertisement  

Other Articles