Baahubali 2 helps police nab wanted ATM thief

Most wanted atm looter arrested while watching bahubali 2

Bahubali-2, Bahubali-2 Odisha, Odisha Most Wanted Criminal, Odisha Most Wanted Theif, Odisha ATM Theif, Baahubali 2 ATM Theif, Baahubali 2 Theif, Baahubali 2 Caught Theif, Sambhav Acharya Baahubali 2, Sambhav Acharya ATM Theif, Baahubali 2 Caught Criminal, Arrest Watching Baahubali 2, Baahubali 2 Arrest, Baahubali 2 Help Police, ATM Looter Baahubali 2

Most wanted ATM looter arrested while watching Bahubali-2 in Odisha. Sambhav Acharya, who is wanted in over 50 cases of theft & loot from ATMs, had come to watch movie was arrested by special squad.

బాహుబలి-2 చూస్తుండగానే అరెస్ట్

Posted: 05/02/2017 07:29 AM IST
Most wanted atm looter arrested while watching bahubali 2

బాహుబలి-2 క్రేజ్ మాములుగా లేదు. అంతకు ముందు నెలకొన్ని అంచనాలు, బ్లాక్ బస్టర్ మౌత్ టాక్.. వెరసి దేశం మొత్తం ఇప్పుడు ఆ సినిమా చూసేయాలని థియేటర్ల వైపు క్యూ కడుతోంది. ఫాస్టెస్ట్ 1000 కోట్ల మూవీగా ఇండియాలో కొత్త చరిత్రను సృష్టించేందుకు సిద్ధమైపోతుంది. అయితే ఆ ఆత్రుతే ఇక్కడో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పట్టించేసింది. ఆసక్తికర ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో చోటుచేసుకుంది.

ఒడిశాలో మోస్ట్‌ వాంటెడ్‌ ఏటీఎం దొంగ సంభవ్‌ ఆచార్య కోసం ఆ రాష్ట్ర పోలీసులు చాలా కాలంగా వెతుకుతున్నారు. పోలీసు వాసన తగిలితే చాలు, చాకచక్యంగా తప్పించుకుని సవాలు విసురుతున్నాడు సంభవ్ ఆచార్య...ఈ నేపథ్యంలో అతనిని ఎలాగైనా అరెస్టు చేయాలని భావించిన పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. ఈ నేపథ్యంలో ‘బాహుబలి 2: ది కన్‌ క్లూజన్‌’ సినిమాను వీక్షించేందుకు భువనేశ్వర్ లోని ఓ థియేటర్‌ సంభవ్ ఆచార్య వచ్చాడు.

సాధారణంగా జనాలున్న ప్రాంతాలకు దూరంగా ఉండే సంభవ్ ఆచార్యను ధియేటర్ వద్ద గుర్తించిన స్పెషల్ స్క్వాడ్ పోలీసులు, వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, సుమారు 500లను కొల్లగొట్టిన సంభవ్ పై 50 కేసులు మాత్రమే నమోదయ్యాయని, చాలా వరకు పెండింగ్ కేసులు అతనిపై అలానే ఉన్నాయని, ఇంతకు ముందు కందగిరి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్లు డీసీపీ సత్యవ్రత బోయ్ వివరించాడు. మొత్తానికి అలా బాహుబలి ఆ గజదొంగను పట్టించేశాడన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Odisha ATM Theif  Sambhav Acharya  

Other Articles