Donald Trump willing to meet Kim Jong-Un

Trump would absolutely meet with kim jong un

Donald Trump, Donald Trump Kim Jong-un, North Korea President, Trump Kim Jong Great Hounour, South Korea India, India North Korea Training, Donald Trump Kim Jong-un, Donald Trump Statement, Kim Jong-un Shocking Comments, Donald Trump Meet Kim Jong-un, Trump Fear Kim Jong

US president Donald Trump says he would meet with North Korea President Kim Jong-un if the circumstances are right and Its a Great Hounour. Under pressure from South Korea, Modi government ends 8-year bonhomie with North Korea.

ట్రంప్ నోటి నుంచి మళ్లీ అలాంటి మాటలా?

Posted: 05/02/2017 09:16 AM IST
Trump would absolutely meet with kim jong un

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశాడు. ఉత్తరకొరియా నియంత, అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ను కలిసేందుకు రెడీ అంటూ ఓ ప్రకటన జారీచేశాడు. కొరియా అణ్వాయుధాల ప్రదర్శన, అమెరికా మదర్ ఆఫ్ బాంబ్ ప్రయోగం.. ఇలా పోటాపోటీ ప్రదర్శనలతో ఇరుదేశాలు కయ్యానికి కాలుదువ్వుతున్న సమయంలో కిమ్ ను ‘సరైన సమయం’ లో కలుస్తానని ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అతని(కిమ్ జంగ్)ని కలవడం చాలా గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పాడు. ‘‘కిమ్‌ను కలవడం సరైనదని అనిపిస్తే తప్పకుండా ఆ పనిచేస్తా. అలా చేయడాన్ని గౌరవంగా భావిస్తా’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అతడిని కలిసేందుకు ఎటువంటి పరిస్థితులు ఉండాలి, ఎప్పుడు కలుస్తాను.. అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. అయితే ఇప్పటికిప్పుడైతే ఆ పరిస్థితులు లేవని, మీటింగ్‌కు ముందు ఉత్తరకొరియా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని తర్వాత వైట్‌హౌస్ ప్రకటించింది.

కిమ్‌ను కలుస్తానని ట్రంప్ తన ఎన్నికల ప్రచారం సందర్భంగా పలుమార్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అణ్వాయుధాయల కంటే మాటల(చర్చల) ద్వారా సత్ఫలితాలను సాధించవచ్చని ట్రంప్ పేర్కొన్నట్లు వైట్ హౌస్ కార్యాలయం ఓ ప్రకటన లో తెలిపింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలతో మూడో ప్రపంచ యుద్ధంకు బీజం వేస్తారని భావిస్తున్న సమయంలో ట్రంప్ వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి.


భారత్ కూడా షాకిచ్చిందిగా...

దక్షిణ కొరియా విన్నపంతో ఉత్తర కొరియాకు భారత్ షాకిచ్చింది. ఉత్తర కొరియా సైనికాధికారులకు భారతీయ భాషల్లో ఇస్తున్న శిక్షణను నిలిపేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర కొరియా సైనికాధికారులు 2008 నుంచి మహారాష్ట్రలో పలు దఫాలుగా భారతీయ భాషల్లో శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఇటీవల అమెరికా సహా వైరి దేశం దక్షిణ కొరియాపై కారాలు మిరియాలు నూరుతోంది.

ఉత్తర కొరియా సైన్యానికి భారతీయ భాషలు నేర్పడం ఆపివేయాలని, ఆ దేశానికి ఎటువంటి సహాయ సహకారాలు చేయరాదంటూ ఇటీవల దక్షిణ కొరియా ప్రభుత్వం భారత్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో స్పందించిన భారత్ ఐక్యరాజ్య సమితి సూచనలు, దక్షిణ కొరియా విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని ఉత్తర కొరియా సైనికాధికారులకు భారతీయ భాషలపై ఇస్తున్న శిక్షణను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  North Korea  Kim Jong-un  

Other Articles