BJP lead in Delhi municipal election counting Modi wave or EVM Wave

Bjp takes massive lead in delhi municipal election

Delhi Municipal Election, DMC Election Counting, BJP Lead DMC, BJP Delhi Elections, AAP EVM Wave, Modi or EVM Wave, DMC Counting, BJP AAP Congress DMC Elections, Kejriwal EVM DMC Results

Delhi Municipal Corporation Election Counting.: BJP takes massive lead, AAP a distant second. Kejriwal's AAP says 'EVM wave' behind BJP's sweep.

ఢిల్లీ కార్పొరేషన్ కౌంటింగ్: ఆప్ కా దుకాణ్ బంద్

Posted: 04/26/2017 11:32 AM IST
Bjp takes massive lead in delhi municipal election

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పై అఖండ విజయంతో జెండా ఎగరేసేందుకు కమలం సిద్ధమైపోయింది. గడచిన పదేళ్ల నుంచి మునిసిపల్ కార్పొరేషన్ పీఠంపై కూర్చుంటున్న భారతీయ జనతా పార్టీ, ముచ్చటగా మూడోసారి అధికారానికి చేరువైంది. ఈ ఉదయం 8 నుంచి మూడు కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు చురుకుగా సాగుతుండగా, మూడింటిలో ఘనమైన మెజారిటీ దిశగా బీజేపీ పరుగులు పెడుతోంది. కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా విఫలమౌతోంది.

ఉత్తర ఢిల్లీ పరిధిలోని 104 స్థానాల్లో 101 స్థానాల్లో ఫలితాలు వెలువడగా, బీజేపీ 65, కాంగ్రెస్ 17, ఆప్ 14, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. తూర్పు ఢిల్లీ పరిధిలో 64 స్థానాలకు గాను 63 స్థానాల్లో ఫలితాలు వెలువడగా, బీజేపీ 42, ఆప్ 11, కాంగ్రెస్ 7, ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు. ఇక దక్షిణ ఢిల్లీ విషయానికి వస్తే, 104 స్థానాలకు గాను 102 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 63, ఆప్ 18, కాంగ్రెస్ 13 చోట్ల విజయం సాధించగా, ఇతరులు 8 చోట్ల గెలిచారు.

కీలకమైన జానకీ పురి తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో బీజేపీ జెండా ఎగరవేసింది. ఇక ఈ ఎన్నికల్లో గెలిచిన ఆప్ నేత గోపాల్ రాయ్ సుక్మా దాడి నేపథ్యంలో వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు. ఇది నరేంద్ర మోదీ హవా కాదని, ఈవీఎంల హవా(ట్యాంపరింగ్) అని ఎద్దేవా చేశాడు. మరోవైపు కేంద్ర మంత్రి హర్షవర్థన్ ప్రజలు బీజేపీ సిద్ధాంతాలను, మోదీ నాయకత్వాన్ని బలంగా నమ్మటం మూలంగానే ఇంతటి ఘన విజయం సాధించబోతున్నామని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi Municipal Corporation Elections  BJP Lead  AAP  

Other Articles