Prez to arrive for OU centenary celebrations రాష్ట్రపతి వదార్ రహేహో.. బిజీ షెడ్యూల్ మధ్య పర్యటన

President pranab mukherjee to attend osmania university s centenary celebration

Osmania University Centenary,osmania university centenary celebration,EFLU convocation, president pranab in hyderabad, president hyderabad traffic rules, osmania university, centenary of osmania, osmania completes 100 years, president pranab mukherjee, india news, president of india, hyderabd news, university news

President Pranab Mukherjee will be in Hyderabad today to attend the Osmania University’s centenary celebrations and the first convocation of the English and Foreign Languages University

రాష్ట్రపతి వదార్ రహేహో.. బిజీ షెడ్యూల్ మధ్య పర్యటన

Posted: 04/26/2017 09:01 AM IST
President pranab mukherjee to attend osmania university s centenary celebration

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. బిజీ షెడ్యూల్ మధ్య ఆయన పర్యటన ఖారారైంది. హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాలలో ప్రణబ్ పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకుని ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్ అంక్షలు కొనసాగుతున్నాయి. ట్రాపిక్ నిలిపివేత, మళ్లింపు చర్యలను ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తీసుకున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సిటీలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఇవాళ మధ్యాహ్నం బేగంపేట్ విమానాశ్రయానికి ప్రత్యేక విమానం ద్వారా చేరుకోనున్న రాష్ట్రపతి అక్కడి నుంచి నేరుగా ఉస్మానియా యూనివర్సిటీ చేరుకుంటారు. చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఆ తరువాత ఇక్కిడి విద్యార్ధులను ఉద్దేశించి ఆయన కీలకోపన్యాసం చేయనున్నారు. ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి రాజ్‌భవన్‌కు రాష్ట్రపతి వెళ్లనున్నారు.

అక్కడి నుంచి గచ్చిబౌలీలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ అడిటోరియంలో జరిగే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ ల్యాంగేజ్ యూనివర్సిటీ కార్యక్రమానికి హాజరువుతారు. అక్కడి నుంచి నేరుగా బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. నగర పర్యటన ముగించుకోనున్న రాష్ట్రపతి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రపతి పర్యాటన సందర్భంగా పలు రూట్లలో, నిర్ణీత సమయాలలో ఆంక్షలు కొనసాగుతాయని సీపీ వెల్లడించారు. వాహనాల మళ్లింపు, రహదారుల నిలిపివేతలు కోనసాగునున్న నేపథ్యంలో వాహనదారులు ముందుగానే తమ రూట్లను తెలుసుకోవాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Osmania University  centenary celebration  EFLU convocation  Pranab Mukherjee  Hyderabad  

Other Articles