AAP blames evms again, maken to step down అజయ్ మకెన్ రాజీనామా.. ఈవీఎంలే గెలిపించాయన్న అప్

Kejriwal s aap says evm wave in bjp sweep maken to quit as delhi congress chief

AAP blames evms again, kejriwal says evms wave, ajay maken quit as delhi congress chief, MCD election result, Delhi MCD election result, MCD election result 2017, MCD election results live, MCD results, BJP, AAP, Congress, Arvind Kejriwal, Modi wave, Municipal corperation Elections, BJP, Congress, AAP, Ajay maken, Delhi

The BJP is surging ahead in all three municipal corporations in Delhi MCD election results 2017 as Congress and Arvind Kejriwal’s Aam Aadmi Party are fighting for the second place.

అజయ్ మకెన్ రాజీనామా.. ఈవీఎంలే గెలిపించాయన్న అప్

Posted: 04/26/2017 12:04 PM IST
Kejriwal s aap says evm wave in bjp sweep maken to quit as delhi congress chief

ఢి్లీలో పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికలలో బీజేపి పార్టీ విజయభేరి మ్రోగించి మరోమారు దేశరాజధాని ప్రజలు కమలం పక్షానే నిలిచామని చాటుకున్నారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలలో బరిలో నిలిచిన అధికార అమ్ అద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఎన్నికలకు కొన్న రోజుల ముందుగానే కాంగ్రెస్ గెలుపు గుర్రాలకు స్థానాలను ఇవ్వకుండా పలువురు నేతల సిఫార్సులతో మాత్రమే సీట్లను ఇచ్చిందని అరోపణలు ఎదుర్కోన్న కాంగ్రెస్.. వాటిని నిజమని చాటిచెప్పినట్లుగానే మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఢిల్లీలోని తూర్పు, ఉత్తర, దక్షిణం పురపాలక సంఘాలలో బీజేపి స్పష్టమైన మెజారిటీని సాధించుకుని ముచ్చటగా మూడోసారి అధికార పగ్గాలను అందుకునేందుకు సిద్దం అవుతున్న నేపధ్యంలో అధికార పార్టీ అప్ మాత్రం ఇది కూడా కేవలం ఈవిఎం మెషీన్ల గెలుపుగానే పరిగణిస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలలో బీజేపి, పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించని క్రమంలో ఆ గెలుపు బీజేపిది కాదని, కేవలం ఈవీఎం మెషీన్లు, ఎన్నికల కమీషన్లదని సంచలన వ్యాఖ్యలు చేసిన అప్.. మరోసారి అవే అరోపణలు వల్లేవేసింది.

ఇకపై దేశంలో ఏ ఎన్నికలు జరిగినా అవన్నీ బీజేపి ఖాతాలోనే పడతాయని, ఈ మేరకు కేంద్రంలోని అధికార బీజేపి పార్టీతో ఎన్నికల కమీషన్ ఒప్పందం చేసుకుందని అప్ నేతలు అరోపిస్తున్నారు. ఇందుకు ఉదాహరణే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలని కూడా చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రయత్నాలు కూడా ఇదే ఒరవడిని కొనసాగించడానికేనని అప్ నేతలు అరోపిస్తున్నారు. అయితే ఢిల్లీలో బీజేపి విజయం కాదని, కేవలం ప్రధాని నరేంద్రమోడీ విజయమని ప్రముఖ జర్నలిస్టులు నిస్టుల్లా హెబ్బర్ పేర్కోన్నారు. బీజేపి గతంలో కౌన్సిలర్లుగా చేసిన ఏ ఒక్కరికి తిరిగి టికెట్లును ఇవ్వలేదని, అదే పార్టీ విజయానికి దోహదపడిందని అన్నారు.

ఇదిలావుండగా, ఢిల్లీ పురసాలక సంఘం ఎన్నికలలో పార్టీ పరాజయానికి నైతిక బాద్యతను వహిస్తూ మాజీ కేంద్రమంత్రి అజయ్ మకెన్ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మరో ఏడాది వరకు ఎలాంటి బాధ్యతలను తాను చెప్పట్టబోనని తేల్చిచెప్పారు. అయితే ఎన్నికలలో తమ పార్టీ అపజయానికి మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కారణమని ఆయన అరోపించారు. వరుసగా మూడు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన షీలాదీక్షిత్.. కనీసం పార్టీ తరపున ప్రచారం చేయలేదని ఆయన అరోపించారు. అయితే ఈ అరోపణలను షీలా దీక్షిత్ తిప్పికోట్టారు. తనను ప్రచారం చేయాల్సిందిగా ఎవరూ కోరలేదని తేల్చిచెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Municipal corperation Elections  Delhi  BJP  Congress  AAP  Ajay maken  Aravind kejriwal  

Other Articles