stale non veg found in hyderabad star hotel, fined ఆ స్టార్ హోటళ్లలోనూ నిల్వచేసిన మాంసాహారం..

Forstale non veg found in hyderabad star hotel fined

novatel hotel fined, madhapur novatel hotel fined, stale meat in novatel hotel, novatel hotel stale meat, Novotel hotel, fine, GHMC raid, stale meat, eateries, public health,madhapur, latest news

In a continuing crackdown on eateries by the GHMC, yet another star hotel - Novotel - in Madhapur was fined Rs30,000 in connection with violations of obtaining and storing meat.

ఆ స్టార్ హోటళ్లలోనూ నిల్వచేసిన మాంసాహారం..

Posted: 04/25/2017 11:53 AM IST
Forstale non veg found in hyderabad star hotel fined

హైదరాబాద్ నగరంలోని సంపన్నులు, బడాబాబులు అధికంగా వెళ్లే.. స్టార్ హోటళ్లలోనూ న్యాణత లేని ఆహారం అందిస్తున్నారన్న విషయం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారుల దాడుల్లో వెలుగుచూసింది. గత కొన్ని రోజులుగా నగరంలోని హోటళ్లలో నాణ్యతను, ఆయా హోటళ్ల అందిస్తున్న అహారం ప్రభుత్వం అమోదం తెలిపిన స్టాంప్ మీట్ నుంచే కొనుగోళ్లు చేస్తున్నారా.. లేక ఎలాంటి మాంసాహారాన్ని వడ్డిస్తున్నరన్న విషయమై అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

నిబంధలను అతిక్రమించిన పలు హోటళ్లకు జరిమానాలు విధిస్తూ.. మరీ నణ్యాత ప్రమాణాలను పాటించడంలేదని నిరూపితమైతే ఏకంగా పలు హోటళ్లను కూడా అధికారులు సీజ్ చేశారు. పంజాగుట్టలోని వై2కే సహా పలు హోటళ్లను కనీస ప్రమాణాలు పాటించడం లేదని ఇప్పటికే అధికారులు సీజ్ చేయగా, వాల్ మార్ట్, ప్యారెడైజ్, బావర్చీ లాంటి అనేక హోటళ్లకు ఫైన్ వేశారు. వాల్ మార్ట్ బెస్ట్ ప్రైజ్ అవుట్ లెట్ కూడా ప్రభుత్వ అమోదించిన స్టాంప్ మీట్ ను విక్రయించని కారణంగా జరిమానా విధించారు.

ఈ క్రమంలో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అధికారులు అన్ని హోటళ్లపై తనిఖీలు చేసి.. నాణ్యత ప్రమాణాలను, స్టాంప్డ్ మీట్ విక్రయిస్తున్నారా లేదా అన్న విషయాలను తెలుసుకుంటూ దాడులు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా మాదాపూర్ లోని స్టార్ హోటల్ నోవాటెల్ లో తనిఖీలు చేసిన అధికారులు.. అక్కడ కూడా నిల్వ చేసిన మాంసాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నారని అధికారుల దాడుల్లో తలిపోయింది. స్టాంప్డ్ మీట్ ను మాత్రమే తీసుకొస్తున్న హోటల్ యాజమాన్యం.. వాటిని పరిమిత కాలంలో వడ్డించకుండా నిల్వ చేసిన మాంసాన్ని వండి వార్చి వడ్డిస్తున్నారని కనుగోనింది. స్టాంప్డ్ మీట్ ప్యాకెట్లపై ప్రింట్ అయిన తేదిని కనిపించకుండా యాజమాన్యం దానిని తొలగించడంతో స్టార్ హోటల్ కు కూడా అధికారులు రూ.30 వేల రూపాయల జరిమానా విధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Novotel hotel  fine  GHMC raid  stale meat  eateries  public health  madhapur  

Other Articles