pf allows to withdraw amount to buy home pay emi శుభవార్త.. ఇల్లు కొనుగోలు, ఈఎంఐల కోసం పీఎప్ ఖాతా వినియోగం

Provident fund allows to withdraw 90 percent amount to buy home pay emi

pf accounts home loans, pf accounts emis, pf accounts site purchase, EPFO, PF accounts, Employees Provident Fund Organisation, Employees Provident Funds (EPF) Scheme, EPF scheme, PF fund, EMIs, home loan EMIs, home buying, latest news

The amended provident fund rules enable subscribers to withdraw up to 90 per cent of their accumulations in their PF account for the purchase of home.

ఫీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇల్లు, స్థలం కొనుగోలు చే్స్తున్నారా..?

Posted: 04/25/2017 12:52 PM IST
Provident fund allows to withdraw 90 percent amount to buy home pay emi

కేంద్ర కార్మిక శాఖ తమ పీఎప్ చందాదారులకు శుభవార్తను అందించింది. సొంత ఇంట్లో వుండాలన్న కార్మికుల కలలను సాకారం చేస్తూ.. ఆ దిశగా అడుగులు వేస్తున్న కార్మికులకు కేంద్ర కార్మిక శాఖ శుభవార్తను అందించింది. సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావిస్తున్న కార్మికులు ఇక నుంచి ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్‌) ఖాతాలోని డబ్బులను కూడా వినియోగించుకునేలా వెసలుబాటను కల్పిస్తుంది. ఇక మీదట ఇల్లు కట్టుకోవాలన్నా, ఇంటి స్థలం కొనాలన్నా, లేక ఫ్లాట్ కొనుగోలు చేసినా.. లేక కొనుగోలు చేసిన ఇంటి రుణానికి నెలసరి వాయిదాలు కట్టాలన్నా.. తమ ఫీఎఫ్ ఖాతాలను వినియోగించుకునే సౌకర్యాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)  అందుబాటులోకి తెస్తోంది. అంతేకాదు ఈ ఖాతా నుంచే ప్రాథమిక చెల్లింపు(డౌన్‌ పేమెంట్‌)కోసం 90శాతం పీఎఫ్‌ విత్‌ డ్రా చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్టు  సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

కార్మిక మంత్రిత్వ శాఖ అదేశాల మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఇపిఎఫ్ఓ 1952 ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ (ఇపిఎఫ్) పథకాన్ని సవరించి కార్మికులకు ఈ నూతన వెసలుబాటును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సవరణ ద్వారా  కొత్త పేరా - 68 బిడి చేర్చి  ఈ పథకాన్ని పీఎఫ్ చందాదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. క్రొత్త నిబంధన ప్రకారం, ఒక ఈపీఎఫ్‌ చందాదారుడు సహకార లేదా హౌసింగ్ సొసైటీలో సభ్యులు కనీసం 10 మంది  తమ ఖాతా నిధుల నుంచి 90 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. నివాస గృహం లేదా ఫ్లాట్ లేదా నివాస గృహ నిర్మాణం  కోసం ఈ విత్‌ డ్రా చేసుకోవచ్చు.  

దీంతో పాటుగా పీఎష్ ఖాతాదారులు ఇదివరకే ప్రభుత్వం, హౌసింగ్ ఏజెన్సీ, ప్రాధమిక రుణసంస్థలు, బ్యాంకుల నుంచి సొందిన గృహరుణాలకు సంబంధించిన నెలసరి వాయిదాల చెల్లింపులకు కూడా ఖాతా నుంచి చెల్లింపులు చేసుకునే వెసలుబాటును కల్పించారు. పీఎఫ్ చందాదారులకు కేవలం జీవితంలో ఒక్కసారి మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకునే అవకాశం వుందని కూడా పీఎఫ్ అధికారులు తెలిపారు. ఈపీఎఫ్‌ఓ నిబంధనలకు లోబడి చందాదారుల అవసరాల మేరకు ఈ పథకం వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ సదుపాయాలను పొందాలంటే పీఎఫ్‌ ఖాతాలో కనీసం మూడేళ్లు కొనసాగాలన్న నిబంధన కూడా వర్తించనుందని అధికారులు స్పష్టం చేశారు. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : EPFO ​​  EMI  Homeloan  PF Account  90percent  withdrawls  purchasing home  Labour Ministry  

Other Articles