Govt. plans home delivery of petrol ఇకపై పెట్రలోల్ కూడా హోం డెలివరీ.. యోచనలో ఇంధన శాఖ

Home delivery of petrol diesel likely as oil ministry considers idea

petrol, diesel, petrol home delivery, diesel home delivery, petrol prices today, petrol diesel home delivery, petrol diesel news, Ministry of Petroleum and Natural Gas, Dharrmendra pradhan, petroleum ministry, india news

In a bid to cut long queues outside fuel pumps, the government is likely considering home delivery of petrol and diesel to consumers if they pre-book, the Ministry of Petroleum and Natural Gas tweeted

ఇకపై పెట్రలోల్ కూడా హోం డెలివరీ.. యోచనలో ఇంధన శాఖ

Posted: 04/22/2017 09:46 AM IST
Home delivery of petrol diesel likely as oil ministry considers idea

మీ వాహనంలో పెట్రోల్‌ అయిపోయిందా..? అన్ లైన్ లో బుక్ చేస్తే మీ ఇంటివద్దకు పెట్రోల్ ను డోర్ డెలివరీ చేస్తారు. అయితే అది ఇప్పడేకాదండోయ్.. కొంత సయమం పడుతుంది. పెట్రోల్ ఉత్పత్తులను కూడా డోర్ డెలివరీ చేయాలని కేంద్ర ఇంధన, నెచ్యూరల్ గ్యాస్ శాఖ యోచిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వరంగ ఇంధన సంస్థలకు అదేశాలను కూడా ఇచ్చింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్న వెంటనే వాటిని సిబ్బంది ఎలా హోమ్ డెలివరీ చేస్తారో.. అదే విధంగా పెట్రోల్, డీజిల్ లను కూడా డోర్ డెలివీరీ చేసేందుకు వీలైన ప్రత్యామ్నాయాలను చూడాలని అదేశించింది.

దీంతో ఇక మీ వాహనాల్లో పెట్రోల్ నిండుకుంటూ బంకుల దాకా బండిని మోసుకెళ్లడమో లేదా బాటిల్‌ పట్టుకుని పెట్రోల్‌ బంకుకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. పెట్రోలియం ఉత్పత్తుల డోర్ డెలివరీ చేసే దిశగా హోమ్ సర్వీసులు అందించేలా ఈ–కామర్స్‌ విధానాన్ని పరిశీలించాలంటూ కేంద్ర ఇంధన శాఖ ఇచ్చిన అదేశాలపై ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) వంటి చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పరిశీలన చేస్తున్నాయి.

ఈ విధానంతో వినియోగదారులకు పెట్రోల్‌ బంకుల్లో బారులు తీరడం, సమయం వృథా కావడం వంటి సమస్యలు తగ్గగలవని చమురు శాఖ పేర్కొంటున్నా భవిష్యత్తులో డీలర్ల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకే కేంద్రం ఈ కసరత్తు చేస్తుందున్న అనుమానాలు కూడా వినబడుతున్నాయి, వినియోగదారులకు ఉపయుక్తంగా ఉండటంతో పాటు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ విధానం తోడ్పడగలదని భావిస్తున్నా.. డీలర్లు గొంతెమ్మ కోర్కెలను అదిలోనే తుంచివేసేందుకు వారు అడపాదడపా జరుపతలపెట్టిన ధర్నాలకు చెక్ పెట్టేందుకు కూడా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటుందన్నా వార్తలు వినబడుతున్నాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  diesel  home delivery  prices  Dharrmendra pradhan  petroleum ministry  

Other Articles