Supreme Court blasts Centre over making Aadhaar mandatory అప్షనల్ అంటే అర్థం తప్పనిసరా..? కేంద్రాన్ని సుప్రీం సూటిప్రశ్న

Supreme court blasts centre over making aadhaar mandatory

Permanent Account number, aadhaar not mandatory, aadhaar card optional, aadhaar government policies, aadhaar government schemes, Aadhaar, Aadhaar Card, Black money, Narendra Modi, pan cards, Income tax, Supreme Court of India

The Supreme Court of India lambasted the Narendra Modi-led BJP government at the Centre for making Aadhaar card a mandatory prerequisite to avail government services.

అప్షనల్ అంటే అర్థం తప్పనిసరా..? కేంద్రాన్ని సుప్రీం సూటిప్రశ్న

Posted: 04/22/2017 09:08 AM IST
Supreme court blasts centre over making aadhaar mandatory

ఆధార్ కార్డులోని ప్రత్యేక గుర్తింపు నెంబరును అన్నింటికీ అనుసంధానం చేస్తున్న కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై.. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. అధార్ కార్డును అన్ని పథకాలకు అసుసంధానం చేయడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా అక్షేఫించింది. ఆధార్ కార్డు నెంబర్ ను కేవలం అప్షనల్ గా మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని.. గతంలో తామిచ్చిన తీర్పుకు కేంద్రం ఎందుకు కట్టుబడి నిర్ణయాలను తీసుకోవడం లేదని ప్రశ్నించింది. అసలు కేంద్రానికి అప్షనల్ అంటే అర్థం తెలుసా..? తెలిస్తే తప్పనిసరి ఎందుకు చేస్తారని నిలదీసింది.

ఆధార్ను తప్పనిసరి నిబంధనగా చేరుస్తూ సుప్రీం ఆదేశాలకు అతిక్రమించడంలో కేంద్రం అంతర్యమేమిటని ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పాన్ కార్డు పొందడానికి ఆధార్ కార్డును ఎలా తప్పనిసరి చేస్తున్నారంటూ ప్రశ్నించింది. తాము ఆప్షనల్గా చేయాలని ఆర్డర్ ఇచ్చినప్పుడు, తప్పనిసరి అని ఎలా ఆదేశిస్తారని మండిపడింది. అయితే ఆధార్ ను తప్పనిసరి చేయడమే ఉన్న ఒకానొక్క ఆప్షన్ అని అటార్ని జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు తెలిపారు.
 
అక్రమ నిధుల తరలింపు నిరోధించడానికి ఆధార్ ను తప్పనిసరి చేయడమే ఒకానొక్క ఆప్షన్ అని ముకుల్ రోహత్గి న్యాయస్థానానికి తెలిపారు. అయితే బలవంతం మీద ఆధార్ ను తీసుకురావడం ఒకటే మార్గమా? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. గత నెల సవరించిన ఆర్థికబిల్లులో బ్యాంకు అకౌంట్లకు, పాన్ కార్డుకు, ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కు ఆధార్ ను కేంద్రం తప్పనిసరి చేసింది. పాన్ కార్డుకు ఆధార్ తప్పనిసరి చేస్తూ దాఖలైన పిటిషన్ పై తదుపరి విచారణ ఏప్రిల్ 25న చేపట్టనున్నట్టు సుప్రిం చెప్పింది. సామాజిక పథకాలకు ఆధార్ తప్పనిసరి చేయొద్దంటూ గతంలోనే సుప్రీం తీర్పునిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aadhaar  Aadhaar Card  Black money  Narendra Modi  pan cards  Income tax  Supreme Court of India  

Other Articles