ములాయం ‘పవర్’ దొంగతనం ఎంతలా ఉందంటే... | Mulayam has electricity bill worth Rs. 4 lakh.

Mulayam singh electricity theft busted

Mulayam Singh Electricity, Mulayam Singh Power Bill, Mulayam Singh Yadav, Mulayam Etawah House, Mulayam Power Theft, Mulayam Yogi Adithyanath, Mulayam Unpaid Bill

Surprise inspection at Mulayam Singh Yadav's residence reveals unpaid electricity bill of Rs 4 lakh. Yogi Adityanath orders to clear unpaid electricity bill by month end.

ములాయంకు ‘పవర్’ షాక్ తగిలింది

Posted: 04/21/2017 10:32 AM IST
Mulayam singh electricity theft busted

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారీ విక్టరీ యూపీలో బీజేపీ పాగా వేయగా, అవమానకర రీతిలో సమాజ్ వాదీ పార్టీ ఘోర పరాభవం చవిచూసింది. అటు పై సీఎం కుర్చీ ఎక్కిన యోగి ఆదిత్యానాథ్ ‘గుండా గిరి’ ఇక సాగబోదంటూ పరోక్షంగా ములాయం, అఖిలేష్ లతోపాటు మిగతా పార్టీలకు వార్నింగ్ సంకేతాలు కూడా పంపాడు. అవినీతి అంతు చూసేందుకు నిర్ణయాలు తీసుకోవటం, వాటిని చకచకా అమలుపరుస్తూ చూపించే దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అధికారం నుంచి దిగిపోయాక ములాయం పరిస్థితి అస్సలు బాగోలేదు. అఖిలేష్ స్వతంత్ర్య నిర్ణయాల వ్యవహారశైలి ఇప్పటిదాకా పార్టీని డ్యామేజ్ చేస్తుండగా, తాజాగా మరో వ్యవహారం ఆయనకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఆయన ఇంట్లో జరిగిన ఓ చిన్న అగ్రిప్రమాదం పెద్ద గుట్టును బయటపెట్టేసింది. అక్రమంగా విద్యుత్ ను వాడుకోవటంతోపాటు, 4 లక్షల బకాయిలు ఉన్నట్లు తేలటం చర్చనీయాంశంగా మారింది. ఎటావాలోని సివిల్ లైన్స్ ఏరియాలో ములాయం ఇల్లు ఉన్న విషయం తెలిసిందే. డజన్ల కొద్ది గదులు, సెంట్రలైజ్డ్ ఏసీ ఇల్లు, టెంపరేచర్ కంట్రోల్ లగ్జరీ స్విమింగ్ పూల్ ఇలా ఆ చుట్టుపక్కల ఇదే కాస్ట్ లీ బంగళా.

గురువారం ఆ ఇంట్లో ఓ చిన్న అగ్నిప్రమాదం జరగటంతో విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు వచ్చిన విద్యుత్ సిబ్బంది పవర్ కనెక్షన్‌లో తేడాను గమనించారు. అధికారికంగా 5 కిలోవాట్లకు తీసుకుని, ఆ స్థానే 40 కిలోవాట్ల కనెక్షన్ ను వాడుకుంటున్నారు. ఇది చూసిన అధికారులు షాక్ తిన్నారు. ఉన్నతాధికారులకు తెలియజేసిన అనంతరం కనెక్షన్‌ను 40 కిలోవాట్లకు మార్చారు. అలాగే ములాయంసింగ్ యాదవ్ రూ.4 లక్షలకు పైగా కరెంటు బిల్లులు చెల్లించాల్సి ఉందని అధికారులు గుర్తించి, ఈ నెలాఖరు వరకు ఆయనకు గడువిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mulayam Singh Yadav  Etawah House  Electricity Bill  

Other Articles