నవభారత్ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా జూ. ఎన్టీయర్..? Junior NTR laughs off on the Political Rumours.

Jr ntr once again gives clarity on his political entry laughs off on rumours

Jr NTR, Nava Bharat National Party, Jai Lava Kusa, Jr NTR Nava Bharat National Party, Jr NTRs political party, Rumours about NTRs political party, Jai Lava Kusa, Jai Lava Kusa movie, telugu news, film news, celebs news, tollywood news, telugu movie updates

Junior NTR well known as tarak by fans, once again gives clarity on his political entry, laughs off on Rumours of being appointed as Nav Bharat party president.

నవభారత్ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా జూ. ఎన్టీయార్..?

Posted: 04/19/2017 01:33 PM IST
Jr ntr once again gives clarity on his political entry laughs off on rumours

జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ట్రెడింగ్ అవుతున్నాడు. ఆయన తాజా చిత్రం జైలవకుశ సినిమా షూటింగ్ లో బిజీగా వున్న ఆయన సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావడానికి కారణమేంటి అంటున్నారా..? అయన సీనిమాలను పక్కనబెట్టి ఇక రాజకీయ ప్రవేశం చేయనున్నారని, ఇందుకోసం ఏకంగా ఓ కొత్త జాతీయ స్థాయి రాజకీయ పార్టీకి ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. అదేంటి ఈ వార్తను నిజంగా నమ్మవచ్చునా... అంటే.. అది ఎవరికి వారు అలోచించుకోవాల్సిందే. అయితే తారక్ రాజకీయ ఎంట్రీపై ప్రచారం మాత్రం ఓ రేంజ్ లో కొనసాగుతుంది.

‘నవ భారత్ నేషనల్ పార్టీ’కి ఏపీ అధ్యక్షుడిగా తారక్ ను నియమించామంటూ నెట్ లో హల్ చల్ చేసిన లేఖపై ఆయన అభిమానులు కూడా అశ్చర్యానికి వ్యక్తం చేశారు. అయితే కొందరు ఈ విషయాన్ని తమ నటుడి వద్దే అడిగి తెలుసుకుందామని ఏకంగా ‘జైలవకుశ’ సినిమా షూటింగ్ స్పాట్ లోకి వెళ్లి.. తారక్ తో ఈ విషయాన్ని చెప్పారట. దీంతో తారక్ రాజకీయ ఎంట్రీ అనగానే చిన్నగా ఓ నవ్వు నవ్వారట. తాను ఇటువంటి వార్తలను పట్టించుకోబోనని వారికి చెప్పాడట. అంతేగాకుండా తన అభిమానులు కూడా ఇలాంటి వార్తలను పట్టించుకోవద్దని, వదిలేయాలని సూచించాడట.

అయితే ఏదో ఒక పార్టీ అండగను తీసుకుని రహస్యంగా రాజకీయ ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని కూడా కుండబద్దలు కొట్టిమరీ చెప్పాశాడట. తానకు ఇప్పడప్పడే రాజకీయాల్లోకి రానని కూడా క్లారిటీ ఇచ్చేసిన తారక్..  ప్రస్తుతం తన దృష్టంతా సినిమాల మీదేనని చెప్పాడట. తాను రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే తానే స్వయంగా బహిరంగ ప్రకటన చేస్తానని అతడిని కలిసిన అభిమానులకు వివరించాడట. మొత్తానికి తన రాజకీయ ఎంట్రీపై తారక్ స్పష్టత ఇచ్చేశాడని, అయితే ఆయన ఎంట్రీ ఎప్పుడిస్తారోనని అభిమానులకు మాత్రం ఎదురుచూపు తప్పడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jr NTR  Tarak  junior ntr  political entry  clarity  rumours  Nava Bharat National Party  

Other Articles