విద్యార్థులకు భానుడి తాపం నుంచి ఊరట.. రేపట్నించే సెలవులు telangana government declares summer vacation for schools

Telangana government declares summer vacation for schools

summer vacation for schools, telangana government, telangana state, telangana heat wave, telangana cm kcr, education minister, dy cm kcr, government schools, private schools, cm kcr

telangana government declares summer vacation for schools from thursday, three days earlier, as heatwave rocks in the state. which begins from 23rd of this month as per shedule.

విద్యార్థులకు భానుడి తాపం నుంచి ఊరట.. రేపట్నించే సెలవులు

Posted: 04/19/2017 12:51 PM IST
Telangana government declares summer vacation for schools

తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చాటుతూ ప్రచండుడిగా మారుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించించి. తెలంగాణలోని అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి వేసవి సెలవులను ప్రకటించింది. షెడ్యూల ప్రకారం ఈ వారంతం నుంచి తెలంగాణలోని పాఠశాలలకు వేసవి సెలవులు అని ముందుగా నిర్ణయించారు. అయితే తెలంగాణలో భానుడు భగభగలు కురిపించడంతో.. తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎండల తీవ్రత మరింత అధికం కానుందన్న వార్తల నేపథ్యంలో ఇవాళ్టి (ఏప్రిల్ 19) నుంచి అధికారికంగా వేసవి సెలవులు ప్రకటించారు.

ఇవాళ్టి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలన్నింటికీ వేసవి సెలవులను వర్తింపజేయాలని ఆయన విద్యాశాఖకు అదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఎండల తీవ్రత అధికంగా ఉండడం, దీనికి వడగాల్పులు కూడా తోడుకావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ శాఖ నుంచి అందిన సమాచారం నేపథ్యంలో.. రాబోయే మూడు, నాలుగు రోజులు మరింత ఎండలు ఉండే అవకాశం ఉండటంతో వారు స్పష్టం చేసిన దరిమిలా.. సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచే వేసవి సెలవులు ఇవ్వాలని విద్యాశాఖను ఆదేశించారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా తక్షణం సెలవులు ప్రకటించాల్సిందిగా విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, అధికారులను కేసీఆర్ ఆదేశించారు. బయట తిరిగే పరిస్థితిలేదని.. విద్యార్థులను స్కూళ్లకు పంపడం భావ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బుధవారం నుంచే సెలవులు అమలయ్యేలా చూడాలని అధికారులను అదేశించిన కేసీఆర్ ఈ నిబంధనలు అతిక్రమించిన పాఠశాలలపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పారు. కాగా కేసీఆర్ నిర్ణయంతో పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు మూడు రోజుల ముందుగానే వచ్చేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cm kcr  heat wave  schools  summer vacation  telangana  

Other Articles