ఇంధన ధరలకు రెక్కలు.. వాహనదారుల జేబులకు చిల్లులు.. Petrol and diesel price hiked

Petrol price hiked by rs1 39 per litre diesel up by rs1 04

petrol, diesel, prices hiked, oil companies, international market, crude oil, petrol price hike, diesel price hike, fuel price hike, petrol prices go up, diesel prices go up, petrol price increase, diesel price increase

Petrol prices have been hiked by Rs 1.39 per litre and cost of diesel has gone up by Rs 1.04 per litre, excluding state levies, from today

ఇంధన ధరలకు రెక్కలు.. వాహనదారుల జేబులకు చిల్లులు..

Posted: 04/16/2017 09:36 AM IST
Petrol price hiked by rs1 39 per litre diesel up by rs1 04

కన్నీళ్లకే కన్నీళ్లోచ్చే.. కష్టానికే కష్టం వేసే.. అంటూ విషాధగీతాన్ని పాడుకోవాల్సిన అవసరం వచ్చింది వాహనదారులకు. పండు వేసవిలో భానుడు భగభగ మంటుంటే.. కేంద్రం అనుమతితో చమురు సంస్థలు కూడా వాహనదారులకు ఇంధన మంటలను రేపారు. ఈ నెలారంభంలో వాహనదారులను కాసింత ఊరట కల్పించినట్టే కల్పించి ఆశలు రేపిన చమురు సంస్థలు పక్షం రోజులు తిరగకుండానే వాటిని అడియాశలు చేశారు. మళ్లీ వాహనదారుల జేబులకు చిల్లులు పెట్టారు.

మళ్లీ ఇంధన ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుని వాహనదారులపై భారం వేశాయి. పెట్రోలు సహా డీజెల్ ధరలు కూడా మరోసారి పెరిగాయి. ఇవాళ్టి నుంచి తక్షణం అమల్లోకి వచ్చేలా పెట్రోలుపై రూ. 1.39, డీజెల్ పై రూ. 1.04 మేరకు పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల్లో వచ్చిన మార్పునకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి.

కాగా, ఈ నెల 1వ తేదీన పెట్రోలుపై రూ. 3.77, డీజెల్ పై రూ. 2.91 చొప్పున తగ్గిస్తూ, చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రజల కోసమే తామేం చేసినా అంటూ బీరాలు పలుకుతున్న కేంద్రం మాత్రం అధికారంలోకి వచ్చిన తరువాత పలు దఫాలుగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ మాత్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోవడం లేదు. పెరిగిన ధరల నేపథ్యంలో హైదరాబాద్ ప్రాంతంలో లీటరు పెట్రోల్ ధర ఏకంగా 72 రూపాయల పైచిలుకు ధర పలుకుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  diesel  prices hiked  oil companies  international market  crude oil  

Other Articles

Today on Telugu Wishesh