బ్లాక్ మెయిలింగ్ కేసులో టీవీ ఛానెల్ ఛీఫ్ అరెస్టు TV channel CEO held on charges of extortion

Tv channel ceo arrested in bengaluru on charges of extortion

kannad tv ceo. kannad tv ceo arrested, janasri news, janasrkannad tv ceo. kannad tv ceo arrested, janasri news, janasri news channel, ceo lakshmiprasad vajapai, lakshmiprasad vajapai extortion, lakshmiprasad vajapai blackmail, lakshmiprasad vajapai arrested, bangalore, bengaluru, india ews, indian express newsi news channel, ceo lakshmiprasad vajapai, lakshmiprasad vajapai arrested, bangalore, bengaluru, crime

Janasri News channel CEO Lakshmiprasad Vajapai has been held for using the channel as an “instrument” to run his “network” of extortion

రూ.15 కోట్లు ఇవ్వాలని టీవీ ఛానెల్ సీఈఓ బ్లాక్ మెయిల్.. అరెస్టు

Posted: 04/16/2017 08:59 AM IST
Tv channel ceo arrested in bengaluru on charges of extortion

మీడియా.. అంటే ప్రజలకు ఓ నమ్మకం, ఓ ధైర్యం. పాలకులు పట్టించుకోకపోయినా మీడియాతో చెబితే పనులు జరుగుతాయన్న నమ్మకం. ప్రింట్, ఎటక్ట్రానికి్ మీడియా మా చేతిలో వున్న పాశుపతాస్త్రాలు అని ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. కానీ ప్రజలను కానీ, ప్రజల విశ్వాసాలను కానీ పట్టించుకోకుండా ఓ టీవీ ఛానెల్ సీఈఓ బ్లాక్ మెయిలింగ్ కేసులో అడ్డంగా దొరికిపోయాడు. కోట్ల రూపాయల డబ్బును ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను అశ్రయించాడు.

డబ్బు ఇవ్వని పక్షంలో బాధిుతుడికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని హెచ్చరించడం సదరు టీవీ ఛానల్ పై ప్రజలకు హేయభావం కలగకమానదు, దీంతో మీడియా కూడా అమ్ముడు పోతుందా అన్న భావన ప్రజల్లో కలుగక మానదు. ఇప్పటికీ మీడియాపై కూడా ప్రజలు చులకన భావం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఓమీడియా సీఈవో.. బాగోతం బయటపడి సంచలనంగా మారింది. తనకు అక్షరాల రూ.15 కోట్లు చెల్లించని పక్షంలో వ్యతిరేక ప్రచారం చేస్తామని హూకరించడం పట్ల ప్రజలు టీవీ ఛానెల్ సీఈవోను ఈసడించుకుంటున్నారు.

కన్నడలోని జనశ్రీ న్యూస్ ఛానెల్ సీఈవో లక్ష్మీప్రసాద్ వాజ్ పాయ్ ఓ పారిశ్రామికవేత్తకు వ్యతిరేకంగా కథనాన్ని టీవీలో ప్రసారం చేశాడు. అనంతరం అతడికి ఫోన్‌ చేసి రూ.15 కోట్లు లంచం ఇవ్వాలని లేని పక్షంలో ప్రచారం తీవ్రతరం చేస్తామని దీనికి తోడు దుష్ప్రచారం చేస్తామని బెదిరించాడు. రూ.15 కోట్లలో ముందుగా రూ.10 కోట్లు చెల్లించాలని, మాకు తెలిసిన వ్యక్తుల పేరుతో అకౌంట్‌కు జమ చేయాలని పారిశ్రామికవేత్తను సూచించాడు. దీనిపై సదరు పారిశ్రామికవేత్త కోరమంగల పోలీసులకు  ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరువురిని శనివారం అరెస్ట్‌ చేశారు. వీరిపై కోరమంగల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tv channel ceo  arrest  industrialist  blackmail  lakshmi prasad vajpai  janasri news  crime  

Other Articles