అదర చుంభనంతో అనేక లాభాలంటే వద్దంటారా..! susprising health benefits of kissing

Susprising health benefits of kissing one never knew existed

lip kiss, express love, benifits of kissiing, kissing, health, health and happiness, health and beauty

More than 700 types of bacteria have been found in the human mouth, but no two people have the exact same, so exchanging saliva with someone can inteoduce new foreign bacteria into your body

అదర చుంభనంతో అనేక లాభాలంటే వద్దంటారా..!

Posted: 04/15/2017 08:39 PM IST
Susprising health benefits of kissing one never knew existed

చుంబనం, అందులోనూ అదర చుంబనం అంటే ఎవరికీ ఇష్టం వుండదు. సినిమాలో లిప్ లాక్ ఉందంటే చాలు.. ఆ మూవీపై అంచనాలు పెరిగిపోతుంది. అందరి దృష్టిని లిప్ లాక్ అనే పదం ఆకర్షిస్తుంది. కానీ ఈ అదర చుంబనాల వల్ల ప్రయోజనం ఏంటీ.. అసలు చుంబనం ఎందుకు..? దాంతో కలిగే లాభాలేంటి అంటే.. అనేకం. నిజం.. చుంబనం కానీ లిప్ లాక్ ల వల్ల కానీ ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పరిశోధనల్లో తేలింది. దేహానికే కాదు అరోగ్యానికి, అందానికి ఈ ముద్దుల ప్రయోజనాలు వున్నాయంటే ఇక ఎవరు మాత్రం వీటిని వద్దంటారు.

తాజాగా చేసిన పరిశోనళ్లో కూడా మరోమారు ముద్దుల వల్ల గుండెకు, ఊపిరితిత్తులకే కాదు ఓవరాల్ గా మన ఆరోగ్యానికి ఎంతో తోడ్పడునందిస్తాన్న విషయం వెల్లడైంది. ఈ విషయం తెలిసే ఇటీవల ‘కిసెంజర్‌’ అనే పరికరాన్ని లండన్ లోని సిటీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రూపొందించారు. ఎదుటివారికి ఫోన్ ద్వారా ఈ పరికరంతో ముద్దు పంపితే.. అవతలి వ్యక్తి అదే అనుభూతిని పొందుతారట. మనిషి నోటిలోని సుమారు 700 రకాల బ్యాక్టీరియా వుందట. అయితే ఏ ఒక్క ఇద్దరిలోనూ ఒకే రకమైనవి వుండవట. దీంతో లిప్ లాక్ లతో ఒకరి నోటితో మరోకరు నోరు పెట్టడం వల్ల అవతలి వారి నోటిలోని బ్యాక్టీరియా మన నోట్లోకి రావడం కూడా అరోగ్యపరంగా మంచిదని అంటున్నారు పరిధోకలు.

చుంబనం, లిప్ కిస్ ల వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

*   లిప్ కిస్ మనల్ని ఒత్తిడిని దూరం చేస్తుంది. ముద్దు పెట్టుకునేటప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలయి మనసును ఎంతో ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఎండార్ఫిన్ హార్మోన్ అయితే మంచి     అనుభూతిని ఇస్తుంది.
*   కేలరీలను కరిగిస్తుంది. ఒక నిమిషం పాటు గాఢంగా చుంబిస్తే 26 కేలరీలు కరుగుతాయి.
*   కొవ్వును తగ్గించడంతో పాటుగా బీపీని నియంత్రిస్తుంది. గుండెకు రక్తప్రసరణ బాగా జరిగేందుకు ముద్దు దోహదం చేస్తుంది.
*   తలనొప్పి లాంటి సమస్య నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది
*   లిప్ కిస్ చేయాలంటే 34 ముఖ కండరాలు కదలాల్సిందే. వీటి కదలికలతో ముఖంపై చర్మానికి ఎక్సర్ సైజ్ అవుతుంది
*   శ్వాసక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. దంతాలకు మేలు చేస్తుంది.
*   ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మనలో పునరుత్తేజాన్ని కలిగిస్తుంది.
*   భాగస్వామితో ఎలాంటి కలహాలు లేకుండా సంసారం సాఫీగా సాగేందుకు దోహదం చేస్తుంది.
*   రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పోత్ర పోషిస్తుంది
*   ప్రతిరోజు ఉదయం ముద్దుపెట్టుకునే వారి ఆయుష్షు మరో ఐదేళ్లు పెరిగే అవకాశాలున్నాయని గతంలో కొందరు నిపుణులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles