బాలీవుడ్ హీరోయిన్ దీపికకు గాయాలు.. నిలిచిన షూటింగ్ Deepika stops 'Padmavati' shooting due to back injury

Padmavati to be delayed due to deepika padukone s injury

padmavati, padmavati deepika, deepika padukone, deepika padukone films, sanjay leela bhansali, Deepika Padukone Padmavati, Ranveer Singh, Shahid Kapoor, bollywood news

Deepika Padukone suffers neck injury due to heavy costumes and jewellery she has to wear for her role in Sanjay Leela Bhansali's Padmavati.

బాలీవుడ్ హీరోయిన్ దీపికకు గాయాలు.. నిలిచిన షూటింగ్

Posted: 04/16/2017 08:17 AM IST
Padmavati to be delayed due to deepika padukone s injury

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రానికి అడుగడుగునా అవాంతరాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రంలోని పద్మావతి పాత్రపై పలు సంఘాలు నిరసనలు, ధర్నాలు చేపట్టి అవంతరాలు సృష్టించాయి. కాగా, ఈ సారి ప్రజాసంఘాల కాకుండా ఏకంగా చిత్రం బృందంలోని కీలక పాత్రధారణి అయిన పద్మావతే చిత్రాన్ని నిలిపివేసింది. ఇంతకీ ఎవరామె అంటారా..?

అమె మరోవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే. అదేంటి చిత్ర హీరోయిన్ చిత్రషూటింగ్ ను ఎందుకు నిలిపివేస్తుంది అంటారా..? అక్కడికే వస్తున్నాం.. పౌరాణిక చిత్రానికి సంబంధించిన పాత్ర కాబట్టి.. అందుకు తగ్గట్టుగా ప్రజల ఊహాలను అందుకునేట్టుగా, అమె భారీ కాస్టూమ్స్ ను ధరించాల్సి వచ్చింది. దీనికి తోడు బరువైన నగలను కూడా ధరించాల్సి వచ్చింది. అయితే ఈ నగలే అమె చిత్రాన్ని నిలివేయించేందుకు కారణమయ్యాట.

ఈ  సినిమాలో దీపికా పదుకునే రాణి 'పద్మావతి'గా కనిపించనుండటంతో.. రాణి పాత్రకు సరితూగే విధంగా అమెకు భారీ కాస్ట్యూమ్స్ తో పాటు, బరువైన నగలు ధరించి నటించాల్సి వుండగా, అదే పనిగా వాటిని మోయడం వల్ల అమె మెడ నరాలు పట్టేశాయట. దీంతో తన మెడ మళ్లి సాధారణ స్థాయికి వచ్చే వరకు చిత్ర షూటింగ్ కు అమె గుడ్ బై చెప్పాశారట. అయితే అమె అధికార ప్రతినిధి మాత్రం దీపికా త్వరలోనే షూటింగ్ లో పాల్గోంటారని చెప్పారు. దీంతో చిత్ర యూనిట్ షూటింగ్‌ కు బ్రేక్‌ వేసి, దీపికకు విశ్రాంతినిచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇన్ని అవాంతరాల నడుమ నవంబర్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించిన చిత్ర యూనిట్ అదే సమయంలో విడుదల చేయగలమా డౌట్స్ కూడా వెంటాడుతున్నాయట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles