అమెరికా దాడిలో ఐఎస్ లో చేరిన కేరళవాసి మృతి Kerala youth killed in drone strike in Afghanistan

Missing kerala youth who joined is killed in drone strike in afghanistan

Murshid Muhammed, missing kerala youth, Middle East, Islamic State group, Nangarhar province, Abdur Rahiman, Indian Union Muslim League, afghanistan, social media app, Telegram, drone strike, Padna, kasargod, Chandera police, Chandera police

Another missing youth from Kerala, Murshid Muhammed, suspected to have joined the Islamic State group, has reportedly been killed in a drone strike in Afghanistan.

అమెరికా దాడిలో ఐఎస్ లో చేరిన కేరళవాసి మృతి

Posted: 04/14/2017 06:27 PM IST
Missing kerala youth who joined is killed in drone strike in afghanistan

సిరియా వైమానిక స్థావరంపై క్షిపణి దాడితో విధ్వంసం సృష్టించిన అమెరికా, ఈసారి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ స్థావరం లక్ష్యంగా అతిపెద్ద బాంబు దాడి చేసింది. అప్ఘనిస్తాన్ లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో ఐఎస్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా ద్రోణి దాడికి పాల్పడింది. అణు రహిత దాడికి పాల్పడినా.. అనేక మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రాణాలను మాత్రం ఈ బాంబు బలిగొనింది. అయితే విచారకరమైన విషయం ఏమిటంటే ఈ దాడిలో కేరళకు చెందిన యువకుడు కూడా ప్రాణాలను కోల్పోయాడు.

కేరళలో మాయమై, ఆపై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరిపోయాడని భావిస్తున్న కేరళకు చెందిన యువకుడు, ముర్షిద్ మహమ్మద్ కూడా అమెరికా జరిపిన జీబీయూ - 43 బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆఫ్గన్ లోని నన్గాన్హర్ ప్రావిన్స్ పరిధిలోని అచిన్ జిల్లాపై ఈ మెగా బాంబ్ స్ట్రయిక్ జరుగగా, ఇస్లామిక్ తీవ్రవాదులతో అక్కడి స్థావరంలోనే వుంటున్న కేరళవాసి ముర్షిద్ మహ్మమద్ కూడా మరణించాడని తెలుస్తుంది.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదల రచనలతో ప్రభావితం చెంది మధ్యప్రాశ్చానికి వెళ్లి అక్కడి నుంచి సిరాయాకు వెళ్లి ఉగ్రవాద సంస్థలో చేరిన ముర్షిద్ ఈ దాడిలో మరణించాడని పాడ్నాకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కు చెందిన నేత అబ్దుర్ రహీమాన్ తెలిపాడు, ఈ మేరకు తనకు సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ ద్వారా ఎస్ఎంఎస్ వచ్చిందని తెలిపాడు. అయితే ముర్షిద్ ఏ రోజున మరణించాడన్న విషయాన్ని మాత్రం తాను చెప్పలేకపోతున్నానన్నిని, ఎస్ఎంఎస్ వచ్చింది నమ్మదగిన సోర్సు నుంచి కాదని అన్నాడు.

అయితే కేరళలోని చండేరా పోలీసులు మాత్రం ఈ విషయాన్ని దృవీకరించడం లేదు. ముర్షిద్ మహమ్మద్ మరణించాడని విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. అయితే ముర్షిద్ మహమ్మద్ మరణించాడన్న వార్త నిజమేూ అయితే తమకు భారత విదేశాంగ శాఖ నుంచి అధికారకంగా సమాచారం అందుతుందని, అప్పటి వరకు తాము వేచిచూస్తామని చెప్పారు. కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో కేరళలోని కసార్ గోడ్ ప్రాంతానికి చెందిన హఫీసుద్దీన్ తేకే మరణించినట్టు కూడా వార్తలు వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Islamic State  missing Kerala youth  Murshid Muhammed  afghanistan  america drone strike  

Other Articles