‘‘జవాన్లు సహనం కోల్పయివుంటే.. ఎందరో యువకులు చనిపోయేవారు’’ Youth would have been killed if jawan had lost his cool

Youth would have been killed if jawan had lost his cool

CRPF jawans, Kashmir protesters, Srinagar bypolls, DGP S P Vaid, CRPF jawans heckled, CRPF jawans coolness, youth lives, JK youth anti nation slogans, CRPF jawans restraint, viral video

J and K DGP S P Vaid lauded the restraint shown by the CRPF jawans who were heckled by some youths in Budgham, saying "any armed force in the world would have retaliated with force".

‘‘జవాన్లు సహనం కోల్పయివుంటే.. ఎందరో యువకులు చనిపోయేవారు’’

Posted: 04/14/2017 05:38 PM IST
Youth would have been killed if jawan had lost his cool

శ్రీనగర్‌ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల విధులను ముగించుకొని వెనుతిరిగి వెళ్తున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల పట్ల జమ్మూకాశ్మీర్ లోని యువత ఎంతో అనుచితంగా ప్రవర్తించినా జవాన్లు మాత్రం సహనం కోల్పోకుండా సంయమనం పాటించారని, ఇది నిజంగా అభినందనీయమని డీజీపీ ఎస్సీ వైద్ అన్నారు. స్థానిక యువకులు జవాన్లను ఎంతో హేళన చేసినా.. వెంటబడి వెంటబడి ఏడిపించినా.. ‘ఆజాద్, గో బ్యాక్‌ ఇండియా’ అంటూ నినాదాలు చేసి.. చేతుల మీద తన్ని, చెంపల మీద గిల్లానా జవాన్లు సహనం కోల్పోకుండా శాంతియుతంగానే అక్కడి నుంచి వెళ్లిపోవడంపై అభినందించారు.

సైనికులు చూపిన సహనానికి ఇటు పోలీసులు, అటు ప్రజలు ‘హాట్సాఫ్‌ టు యు’ అంటూ సైనికులకు అభివాదం చేస్తున్నారు. ఏ మాత్రం రెచ్చిపోయి అల్లరి మూకలపైకి కాల్పులు జరిపినా ఎంతో మంది పిల్లల ప్రాణాలు గాల్లో కలసిపోయేవని, ఎంతో మంది తల్లులకు గర్భశోఖం మిగిలేదని వైద్‌ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటనపై జవాన్లు చదూర పోలిస్ స్టేషన్ పరిధిలో నమోదు చేసిన పిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని ఆయన అన్నారు. చట్టరం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.

కాగా, ఈ వీడియో చూసిన ఎందరో భారతీయు యువత దీనిపై స్పందించింది. కోందరు ఎవరు మన భారతవని శత్రుదేశాల చోరబడకుండా అహర్నిశలు కాపాడుతున్నారో వారిపై దాడులు చేస్తారా..? అంటూ విరుచుకుపడగా, మరికోందరు మాత్రం సైనికులు ఎందుకు అంత ఉపేక్షించారో, కాల్పులు జరిపితే వారికి తెలిసొచ్చేది’ అంటూ ఎంతో మంది కామెంట్‌ చేస్తున్నారు. ఈ విషయమై టీమిండియా క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్; మహమ్మద్ కైప్ కూడా తమదైన స్టైల్లో విరుచుకుపడిన విషయం తెలిసిందే

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CRPF jawans  JK youth  dgp sp vaid  srinagar bypolls  viral video  

Other Articles