డిజిటైల్ లావాదేవీలతో భద్రత పరమైన ఇబ్బందులు: అర్బీఐ మాజీ డీజీ Digital Payments Will Create Security Risks, Says Gandhi

Rushing on digital payments will create security risks says former rbi deputy governor r gandhi

R Gandhi, Raghuram Rajan, Reserve Bank of India (RBI), demonetization, currency notes, ATMs, Demonetization Act

R Gandhi, retired deputy governor, has cautioned against the rush to introduce digital payment options in a bid to reduce the use of cash in the economy.

డిజిటైల్ లావాదేవీలతో భద్రత పరమైన ఇబ్బందులు: అర్బీఐ మాజీ డీజీ

Posted: 04/12/2017 12:38 PM IST
Rushing on digital payments will create security risks says former rbi deputy governor r gandhi

దేశంలో ఇకపై అన్ని లావాదేవీలను డిజిటల్‌ చేయాలని భావిస్తున్న కేంద్రం.. నగదు రహిత లావాదేవీల వ్యవస్థలను అమలు చేయడంలో తొందరపాటు వద్దని రిజర్వు బ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నరు ఆర్‌.గాంధీ హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగాన్ని తగ్గించటమే లక్ష్యంగా జరుగుతున్న డిజిట్ లావాదేవీల వ్యవస్థలను తీసుకువస్తున్నారని, అయితే ఈ నగదు రహిత లావాదేవీల వ్యవస్థల విషయంలో కేంద్రం అచితూచి అడుగులు వేయాల్సిన అవసరముందని అన్నారు.

డిజిటల్ లావాదేవీల వ్యవస్థలను అమల్లోకి తీసుకురావడంతో వేగాన్ని నియంత్రించాల్సిన అవసరం వుందన్నారు. డిజిటల్ పేమెంట్ వ్యవస్థలను పూర్తిగా, క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మటే వాటిని అమలులోకి తేవాలన్నారు. లేని పక్షంలో భద్రతయుతమైన ఇబ్బందులు తలెత్తడంతో పాటు.. ఆర్థిక ప్రమాదాలు కూడా తలెత్తే అవకాశాలు లేకపోలేదని అయన అందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం అనుమతులు ఇవ్వడంతో కుప్పలు తెప్పలుగా డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థలు అమల్లోకి వస్తున్నాయని ఇది శుభపరిణామం కాదన్ని అయన అభిప్రాయపడ్డారు

నగదు అన్నది వాస్తవమని దానిని ఏదీ భర్తీ చేయలేదని.. వాస్తవం అన్నది కొనసాగుతుందని అన్నారు. నగదు రహిత లావాదేవీలు కొనసాగాలని అంటూనే.. వీటిని ప్రోత్సహించేందుకు కరెన్సీ సరఫరా తగ్గిస్తే అసలుకే ముప్పు రావచ్చునని అన్నారు. అర్బీఐలో సుదీర్ఘ అనుభవంతో పాటు కరెన్సీ, పేమెంట్‌ సిస్టమ్స్‌ వంటి పలు విభాగాల్లో మంచి పట్టు సాధించిన గాంధీ... నగదు వల్ల కలిగే ప్రయోజనాలను అంత సులభంగా ఇతర సాధనాలతో భర్తీ చేయలేమని తెలిపారు. అయితే నగదు రహిత లావాదేవీలు వేగం పెరగాలంటే.. వాటికి ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు సాధ్యమన్నారు.

ఇక ప్రధాని నరేంద్రమోడీ ఈ శుక్రవారం ప్రారంభించనున్న ఆధార్ పే గురించి గాంధీ మాట్లాడుతూ.. అధార్ చెల్లింపుల విధానంలో కూడా లోపాలున్నాయన్నారు. ఆధార్ నెంబరు అదారంగా చెల్లింపుల జరపడంలో తప్పులేదన్న ఆయన డేటాబేస్ ను పేమెంట్ సిస్టమ్ తో అనుసంధానం చేయడంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలోఆధార్‌ డేటాబేస్, పేమెంట్‌ సిస్టమ్‌ మధ్య ఉన్న దూరంపైనే ఆందోళన ఉందన్నారు. ఈ విధానంలో రెండు వేర్వేరు సిస్టమ్ లు సమన్వయంతో పనిచేయాల్సి వుంటుందని,  అలా కానీ పక్షంలో ఇబ్బందులు తల్తెత్తే ప్రమదముందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles