రూ.30 టిప్ లో వాటా కోసం పోట్లాట.. చనిపోయిన మిత్రుడు Waiter Killed for Rs. 30 Tip in Hyderabad!

Up man killed by friend over share in rs 30 tip

Hotel worker, Homeless hotel worker, Hyderabad, Fight over hotel tip, Uttar Pradesh man raju murder, raju, kamlesh, public gardens, share of Rs 30, tip, bearers in hotel, old city, Telangana, crime news

A fight over a tip of Rs 30 between two hotel workers and friends, one raju killed by his friend kamlesh, in public gardens.

రూ.30 టిప్ లో వాటా కోసం పోట్లాట.. చనిపోయిన మిత్రుడు

Posted: 04/11/2017 04:13 PM IST
Up man killed by friend over share in rs 30 tip

కూటి కోసం, కూలి కోసం పట్టణానికి బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం అన్న శ్రీశ్రీ వ్యాఖ్యలు ఎంత నిజమో ఇట్టే అర్థమయ్యేలా చేస్తుందీ ఘటన. రెక్కాడితే గాని డొక్కాడని కష్ట జీవులు... పోట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి వచ్చినా.. గత కొన్నేళ్లుగా బాగానే కలసివున్నారు. చిన్న విషయమైమై ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగడంతో ఒక్కరిని మరోకరి తోసివేయడం, అతను కింద పటడం.. తలకుబలంగా రాయి తగలడంతో తీవ్రరక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందడం జరిగిపోయాయి.

ముఫై రూపాయలు ఒక‌ నిండు ప్రాణాలన్ని బలిగోంటుందని, అదీ తన స్నేహితుడి ప్రాణాలనే తీస్తుందని ఊహించని మృతుడి స్నేహితుడు.. మాత్రం నిచేష్టుడై పోలీసులు అదుపులో వున్నాడు. వివరారల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన‌ రాజు, క‌మ‌లేష్ ఇద్దరు మంచి మిత్రులు. ఇద్దరూ ఓల్డ సిటీలోని ఓ హోట‌ల్‌లో వెయిట‌ర్లుగా ప‌నిచేస్తున్నారు. ఇక రాష్ట్రాలు దాటి వచ్చిన వీరికి ప‌బ్లిక్ గార్డెన్స్ రాత్రి విడిదిని ఇస్తుంది. ప్రతిరోజు మాదిరిగానే అరోజు కూడా యధావిధిగా ఇద్దరు కలసి పని కోసం హోటల్ కు వెళ్లారు.

అరోజు ఓ క‌స్టమ‌ర్ కమలేష్ కు రూ.30 టిప్ ఇచ్చాడు. అదే ఇద్దరి మధ్యన గొడ‌వ‌కు దారి తీసింది. రూ.30లో త‌న‌కు కూడా వాటా ఇవ్వాల్సిందిగా క‌మ‌లేష్ రాజును కోరాడు. టిప్పు త‌న‌ కొచ్చిందంటూ …అందులో వాటా ఇచ్చేందుకు నిరాక‌రించ‌డంతో ఇద్దరి మ‌ధ్య గొడ‌వ మొద‌లైంది. మాటమాట పెరగిన క్రమంలో రాజును క‌మ‌లేష్ తోసేసాడు. దీంతో కిందపడిన రాజు తలకు బలైమైన గాయం తగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల సమాచారంతో ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. క‌మ‌లేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raju  kamlesh  public gardens  Rs 30  tip  murder  hotel bearers  old city  Telangana  crime news  

Other Articles