‘పోకిరి’ ఎస్ఐ.. రౌడీకి ఎక్కువ.. పోలీస్ కు తక్కువ.. cyberabad CP oders Inquiry imto pet basheerabad si issue

Cyberabad cp oders inquiry imto pet basheerabad si issue

cyberabad police commissioner, Sandeep Shandilya, pet basheerabad, si koteshwar rao, civil matters, pet basheerabad police station, real estate issue, Rs 75 lakh hand loan, shiva prasad, ravindra prasad. realtors, crime

cyberabad police commissioner serious on pet basheerabad si koteshwar rao issue, who is involved in settling civil matters in police station.

ITEMVIDEOS: ‘పోకిరి’ ఎస్ఐ.. రౌడీకి ఎక్కువ.. పోలీస్ కు తక్కువ..

Posted: 04/11/2017 03:53 PM IST
Cyberabad cp oders inquiry imto pet basheerabad si issue

పోలీసులు అనగానే ఓ గౌరవం ఉట్టిపడుతుంది. ప్రజలకు శాంతిభద్రతలు కల్పించడంలో అహర్నిషలు కృషి చేస్తారని.. నిషీధి సమయంలో కూడా నిద్ర మేల్కోని మరీ విధులకు కట్టుబడి పెట్రోలింగ్ చేస్తూ. పురపౌరులు హాయిగా గుండెలమీద చెయ్యివేసుకుని నిద్రపోయేందుకు దోహదపడతారని.. అయితే ఒకరిద్దరు మాత్రం మొత్తం పోలీసులు చేస్తున్న శ్రమనంతా గంగలో కలిపేస్తుంటారు. అ కొవకు చెందిన వారే పేట్ బషీరాబాద్ పోలిస్ స్టేషన్ ఎస్ఐ కోటేశ్వరరావు.

తన నామస్థార్థకం చేసుకునేందుకు కోట్లకు పడగలెత్తాలని అనుకున్నాడో ఏమో తెలియదు.. లేక సినిమాల ప్రభావంతో అలాగే వుండాలి.. అలాగే సెటిల్మెంట్లు చేయాలని బావించాడో ఏమో కూడా తెలియదు. మొత్తానికి మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రంలో రౌడీకి ఎక్కువ, పోలిస్ కు తక్కువగా వుంటే ఓ ఎస్ఐ పాత్రదారి తరహాలోనే పాయింట్ బ్లాంక్ లో తుపాకీని పెట్టి మరీ రియల్ మ్యాటర్లను సెటిల్ చేశాడు. పోలీసులు రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదన్న న్యాయస్థానాల అదేశాలను కూడా పాటించకుండా తనకు తానే బాస్ గా వ్యవహరించాడు.

ఫలితంగా తాను విధులు నిర్వహిస్తున్న పోలిస్ స్టేషన్ లోనే తనకు వ్యతిరేకంగా పోలిస్ కేసు నమోదు చేసుకునే దుర్భరస్థితికి చేరుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. శివ ప్రదీప్, రవీంద్ర ప్రసాద్ ఇద్దరూ రియల్టర్లు. వీరిద్దరికీ మధ్య మంచి స్నేహం వుంది. అయితే తనకు అనుకోకుండా డబ్బు అవసరమైన నేపథ్యంలో రవీంద్రప్రసాద్.. శివప్రదీప్ నుంచి 75 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని దానికి పూచీకత్తుగా భూమి పత్రాలను పెట్టుకున్నాడు. అయితే తనకు డబ్బు అవసరమై హైదరాబాద్ కు వచ్చిన శివప్రదీప్.. రవీంద్రప్రసాద్ ను డబ్బు అడగ్గా.. నాలుగు లక్షలు మాత్రమే ఇచ్చాడు.

మిగతా డబ్బు కోసం స్థానికంగా వున్న సుచిత్ర సినిమా థియేటర్ కు రావాల్సిందిగా చెప్పాడు. అక్కడికి వెళ్లిన శివప్రదీస్ ను పోలీసులు చుట్టుముట్టి జీపులో ఎక్కించుకుని స్టేషన్ కు తీసుకెళ్లి మరీ టార్చర్ పెట్టారు. వెంటనే పేపర్లు ఇవ్వాలని లేని పక్షంలో మరోమారు థర్డ్ డిగ్రీ రుచి చూడాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించడంతో మరో గత్యంతరం లేక శివప్రదీఫ్ వెంటనే పత్రాలను తీసుకువచ్చి రవీంద్ర ప్రసాద్ కు ఇచ్చి అక్కడి నుంచి బయటపడ్డాడు.

అయితే మరో స్నేహితుడి సాయంలో సైబరాబాద్ కమీషనర్ వద్దకు వెళ్లి.. తనకు పోలిస్ స్టేషన్ లో జరిగిన పరాభవం.. టార్చర్ పై తన అవేదనను వెల్లబోసుకున్నాడు. తనపై దాడి జరుగుతున్న క్రమంలో మొబైల్ ఫోన్ లో వాయిస్ రికార్డింగ్ చేసిన శివప్రసాద్ దానిని కూడా సీపీ సందీఫ్ శాండిల్యకు సమర్పించారు. దీంతో బాలానగర్ డీఎస్సీని ఈ విషయమై విచారణ చేసి. తనకు సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా కమీషనర్ అదేశించారు. దీంతో విచారణ జరిపిన బాలానగర్ డీఎస్సీ.. బాధితుడ్ని పేట్ బషీరాబాద్ పోలిస్ స్టేషన్ లోనే పిర్యాదు చేయాల్సిందిగా సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles