నటుడు, మాజీ ఎంపీ రితేష్ పై ఎఫ్ఐఆర్.. FIR filed against actor JK Ritesh

Fir filed against actor jk ritesh

actor ritesh, actor JK Ritesh, politician JK Ritesh, ritesh cheating case, ritesh madras high court, ritesh athinarayana, ritesh, actor, politician, athinarayana subramaniyan, madras high court, cheating case, kollywood, filmy news, entertianment news

The Central Crime Branch had filed an FIR against actor and politician J K Rithesh, on charges of cheating along with 6 others including his wife and son.

నటుడు, మాజీ ఎంపీ రితేష్ పై ఛీటింగ్ కేసు.. ఎఫ్ఐఆర్ లో భార్య పేరు..

Posted: 04/06/2017 09:19 AM IST
Fir filed against actor jk ritesh

పెద్దలు చేసిన పాపం ఇంటిల్లిపాదికి చుట్టుముడుతుందని ధర్మశాస్త్రాలు చదవిన పెద్దలు తరచూ చెబుతుంటారు. ఇలాంటి పనే చేసిన నటుడు మాజీ పార్లమెంటు సభ్యుడు రితీశ్‌ తాను చేసిన తప్పుకు తన భార్యను కూడా పణంగా పెట్టాడు. అమెపై కూడా పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. రితీశ్ తన పరిచయస్తుడ్ని రూ.2.18 కోట్ల మోసం కేసు  నమోదైంది. రితీశ్ అవసరం మేరకు తన కుమారుడి నుంచి రూ.2.18 కోట్లు తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారంటూ ఓ వ్యక్తి మద్రాస్ హైకోర్టును అశ్రయించడంతో ఈ కేసు నమోదైంది.

మాజీ పార్లమెంటు సభ్యుడు, నటుడైన రితీశ్ తో పాటు అతనికి సంబంధించిన వారు..  వారి అసవరాల మేరకు తన కుమారుడు నుంచి సుమారు రెండు కోట్ల 16 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్ని డబ్బును తిరిగి చెల్లించడం లేదని  చెన్నైకి చెందిన ఆదినారాయణ్ సుబ్రమణియన్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టును అశ్రయించారు, శ్రీపెంరంబదూర్ లో వున్న మూడు కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని పూచికత్తుగా పెట్టారని, అయితే మూడేళ్లలో మొత్తం డబ్బును తిరిగి చెల్లిస్తామని చెప్పిన రితీశ్.. గత రెండేళ్లుగా చెల్లని చెక్కులను మాత్రమే ఇచ్చారని అరోపించారు.

చెక్కులు బౌన్స్ కావడంతో గత్యంతరం లేక తాను న్యాయస్థానాన్ని అశ్రయించానన్నారు. ఈ విషయమై తాను 2015లో పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా వారు కేసు నమోదు చేయకపోవడంతో ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అథినారాయణన్ ఆరోపణలకు సరైన ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేయాల్సిందిగా నవంబరు 12, 2015లో ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే కేసును దర్యాప్తు చేయాల్సిందిగా చెన్నై నేర విభాగం పోలీసులకు గతేడాది ఆగస్టులో కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రోన్నత న్యాయస్థానం అదేశాలు జారీ చేసినా దానిని పట్టించుకున్న పాపన పోని పోలీసుల తీరుపై మరోమారు అథినారాయణన్ న్యాయస్థానం తలుపుతట్టారు. ఈ కేసును అసిస్టెంట్ కమిషనర్ విచారించాలని సూచించినా ఎవరూ ముందుకురాలేదని.. న్యాయస్థానం అదేశాలు జారీ చేసి రెండేళ్లు కావస్తున్నా.. తమను ఎవరు పట్టించుకోలేదని ఆదినారాయణన్ మరోమారు కోర్టుకెక్కారు. హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నారంటూ పోలీస్ కమిషనర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ధిక్కార పిటిషన్‌ను గత నెలలో విచారించిన కోర్టు నాలుగు వారాల్లో రితీశ్‌పై కేసు నమోదు చేయకుంటే పోలీసు అధికారులపై తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ న్యాయమూర్తి హెచ్చరించారు. దీంతో స్పందించిన పోలీసులు రితీశ్, ఆయన భార్య జ్యోతీశ్వరి తదితరులపై కేసు నమోదు చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles