స్నేహం కోసం మొసలితో కలబడ్డ చిన్నారి.. ధైర్యసాహసాలు అదుర్స్.. 6 year old Tiki fights a crocodile saves a life

6 year old tiki fights a crocodile saves a life

Tiki Dalai, 6 year-old girl, Bankuala village, Kendrapara district, Odisha. courage, Basanti Dalai, crocodile attack, village pond, little girl fight with crocodile, animal-man encounter, little girl courage,

Tiki Dalai is a 6 year-old girl from Bankuala village in Kendrapara district of Odisha. The first sight of the frail tiny girl will never make one believe that today, she displayed exemplary courage and save her friend Basanti Dalai from furious crocodile attack.

స్నేహం కోసం మొసలితో కలబడ్డ చిన్నారి.. ధైర్యసాహసాలు అదుర్స్..

Posted: 04/06/2017 08:26 AM IST
6 year old tiki fights a crocodile saves a life

స్నేహాన్ని కూడా అవసరానికి వాడుకుని వదిలేస్తున్న నేటి రోజుల్లో.. స్నేహితురాలు అపదలో వుందంటే.. అక్కడి నుంచి అమడదూరం పరిగెత్తే వారు మన చుట్టూ సంచరిస్తున్న తరుణంలో.. స్నేహాన్ని స్నేహంగా.. న్నేహితురాలికి వచ్చిన ఆపద తనదిగా భావించిన ఓ చిన్నారి కొండంత ధైర్యం.. మొక్కవోని అత్మవిశ్వాసం.. అందరలోనూ స్ఫూర్తి నింపుతోంది. అదర్శంగా నిలుస్తుంది. ఇంతకీ ఆ చిన్నారి వయస్సు ఎంత అనుకుంటున్నారు. నిండా ఆరేళ్లు కూడా నిండలేదు. ఈ చిన్నారి చేసిన సాహసం ఇప్పుడు సంచలనంగా మారింది.

మొసలిని చూస్తే ఎంత పెద్దవారైనా అమ్మో అంటూ పరుగు లంఖించుకుంటారు. కానీ ఈ చిన్నారి ఏకంగా మొసలితో కలబడి తన స్నేహితురాలిని కాపాడింది. ఆమెను ప్రాణాలతో దక్కించుకుంది. ఒడిశాలోని కేంద్రపర జిల్లాలో చోటుచేసుకుంది ఈ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. బాంకులాలా గ్రామానికి చెందిన ఒకటో తరగతి అమ్మాయి టికీ దలాయ్‌ తన క్లాస్ మేట్ బసంతి దలాయ్‌తో కలసి చెరువులో స్నానం చేయడానికి వెళ్లింది. ఇద్దరు సరదాగా కాసేపు చెరువులో స్నానం చేశారు. జలకాలాటలలో అంటూ అడిపాడుకున్నారు.

స్నానాలు ముగించుకుని చెరువు నుంచి బయటకు వస్తున్న సమయంలో బసంతి దలాయ్ పై ఒక్కసారిగా మొసలి దాడిచేసింది. వెంటనే స్పందించిన టికీ…. దగ్గరలోని కర్ర తీసుకుని… మొసలి తలపై తన బాలన్నంతా పెట్టి ఒక్క బాదుడు బాదింది. ఆ దెబ్బకు బాసంతిని తన నోట కరుచుకున్న మొసలి అమెను విడిచిపెట్టి.. చెరువులోకి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బసంతికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ధ్రువీకరించారు.

తన ధైర్య సాహసాలతో స్నేహితురాలి ప్రాణాలు కాపాడినందుకు టికీని స్థానికులు అభినందించారు. బసంతి వైద్యానికి అయ్యే ఖర్చులు తామే భరిస్తామని, నష్ట పరిహారాన్ని కూడా అందిస్తామని అటవీ అధికారులు తెలిపారు. మరోవైపు టికీని సాహస అవార్డుకు ప్రతిపాదించాలని కోరుతున్నారు స్థానికులు. అయితే ఇలాంటి చిన్నారుల ధైర్యసాహసాలను గదుల్లో కూర్చోని నిత్యం సెల్ ఫోన్లతో అడుకుంటున్న చిన్నారులు కూడా ఆదర్శంగా తీసుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tiki Dalai  courage  Basanti Dalai  crocodile attack  Bankuala village  Kendrapara district  Odisha  

Other Articles