ఆ టీడీపీ నేత చెంప చెల్లుమంది.. బీజేపి నేత మజాకా..! TDP MLC Buddha Venkanna slammed for his letter

Tdp mlc buddha venkanna slammed for his letter

Purandeswari, TDP MLC, Buddha Venkanna, buddha venkanna letter, buddha venkanna purandeswari, TDP, Chandrababu, YSRC Defected MLA, congress, BJP, politics

TDP MLC Buddha Venkanna, who came down heavily on Purandeswari got slammed for his letter, as the bjp leader responds to his critics and says even babu is defected from congress to TDP.

ఆ టీడీపీ నేత చెంప చెల్లుమంది.. బీజేపి నేత మజాకా..!

Posted: 04/06/2017 10:10 AM IST
Tdp mlc buddha venkanna slammed for his letter

పార్టీ ఫిరాయింపు అని దేనిని అంటారో.. ఏది ఫిరాయింపు కిందకు వస్తుందో.. ఏది కాదో కూడా తెలియని నాయకులు తనను విమర్శిస్తున్నారని అన్నారు బీజేపి జాతీయ నేత దగ్గుబాటి పురందేశ్వరి. పార్టీ ఫిరాయించిన వారి సభ్యత్వాన్ని రద్దు చేయకుండానే వారికి మంత్రి పదవులను ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాసి సంచలనం సృష్టించిన పురంధేశ్వరి తనపై వస్తున్న విమర్శలకు స్పందించారు.

తాను పార్టీ ఫిరాయించానని వస్తున్న విమర్శలకు బదులిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే తాను బీజేపీలో చేరిన విషయాన్ని తెలుసుకుని మాట్లాడితే విమర్శకులకు మంచిదని హితవు పలికారు. ఒకవేళ ఇది ఫిరాయింపే అయితే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన చంద్రబాబది కూడా ఫిరాయింపే కదా..? అంటూ అమె పరోక్షంగా ప్రస్తావించారు. ఒంగోలులో ఆమె మీడియాతో మాట్లాడుతూ అమిత్‌షాకు లేఖ రాసిన విషయం వాస్తవమేనన్నారు.

అయితే ఈ విషయంలో మరికొంత క్లారిటీ కోసం అప్పట్లో ఆదెయ్య, రత్తయ్యలను కూడా పదవులకు రాజీనామా చేశాకే ఎన్టీఆర్ పార్టీలో చేర్చుకున్నారన్న విషయాన్ని అమె గుర్తు చేశారు. అయితే తాను బీజేపిని వీడి వైసీపీలోకి చేరుతానంటూ విమర్శలు చేసిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న రాసిన లేఖలోని అంశాలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. దీంతో టీడీపీ నేత చెంప చెల్లుమనిపించేలా బీజేపి నేత బదులిచ్చారని అమె మద్దతుదారులు అంటున్నారు. కాగా పురంధేశ్వరి వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Purandeswari  Buddha Venkanna  TDP  Chandrababu  YSRC Defected MLA  politics  

Other Articles