ఉదయాన్నే లేటుగా నిద్ర లేస్తే.. ఏమండీ ఆఫీసుకు వెళ్లరా..? అంటూ అదే సుప్రభాతంగా మీ అర్థాంగి నిద్రలేపుతున్నారా..? అప్పుడే అనిపిస్తుంది కదూ.. ఓరి దేవుడా నా రాత ఇలా ఎందుకు రాసావు.. ఏదో ప్రభుత్వ ఉద్యోగానైనా ఇచ్చివుంటే.. కనీసం మద్యాహ్నానికి ముందు వెనుక కునుకు తీసే అదృష్టమైనా వుండేదీ అని..? ఇక మరికొందరు మరీ అత్యాశపరులు వుంటారు. వీళ్లు తమకు నిద్రపోయే ఉద్యోగన్నే ఎందుకని దేవుడు తమకు కల్పించకూడదు అని అడుగుతూ వుంటారు.
సరిగ్గా అ రెండో కోవాకు చెదిన వారి కోసమే ఓ ఉద్యోగం వుంది. ఈ ఉద్యోగంలో మీరు చేయాల్సిందల్లా హాయిగా నిద్రపోవడమే. తినడం, పడుకోవడం.. ఇదే ఉద్యోగం. బాగానే వుందికానీ ఇలా చేస్తే మాత్రం ఎవరు జీతం ఇస్తారు అనుకుంటున్నారా.. ఇస్తారట. సరేలే వచ్చే జీతంతోనే ఇల్లు నడవడం కష్టంగా వుంది.. ఇలాంటి ఉద్యోగాలు చేస్తే వారిచ్చే అత్తెసరు జీతాలతో ఇల్లు గడవద్దు అంటారా..? అయితే అక్కడే నిద్రమత్తులో కాలేశారు. లక్షల రూపాయల జీతం ఇస్తారట.
ఏంటేంటీ..? అర్హతలేమిటీ అంటూ అడుగుతున్నారా.., మీరు పురుషులు, పొగతాగడం అలవాటు లేని వారు, బాడీ మాస్ ఇండెక్స్ 22-27 మధ్య ఉంటే చాలు. అవన్నీ వున్నాయని భావిస్తున్నారా...? అయితే ఇకనేం మీరు కూడా ఈ ఉద్యోగానికి ప్రయత్నించండి.... హాయిగా నిద్రపోవడం. అవును! ఈ ఉద్యోగం కోసం అర్హులైన వారికోసం వెతుకులాట కూడా ప్రారంభమైంది. ఫ్రాన్సిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ మెడిసిన్ అండ్ ఫిజియాలజీకి చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో భాగంగా నిద్రపోయే వారి కోసం వెదుకుతున్నారు. ఉద్యోగం పొందినవారు సరిగ్గా అరవై రోజుల పాటు తినడం పడుకోవడం. ఇక కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానాదులు అచరించడం వంటివి చేస్తే సరిపోతుంది. ఇక వీరి అందుకుగాను ఏకంగా 16 వేల యూరోలు (దాదాపు 11.2 లక్షల రూపాయలు) చెల్లించనున్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భార రహిత స్థితిలో పునరుత్పత్తిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. ఈ పరిశోధనల్లో భాగంగా రెండు నెలలపాటు నిద్రించే వారి కోసం అన్వేషణ ప్రారంభించారు. మూడు దశల్లో వీరిపై ప్రయోగాలు చేస్తారట. మొదటి రెండు వారాలు వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 60 రోజులు నిద్రపోవాల్సి ఉంటుంది. తర్వాత తిరిగి మామూలు స్థితికి చేరుకునేందుకు రెండు వారాలు పునరావాస కేంద్రానికి పంపిస్తారు. తలను కిందికి ఆరు డిగ్రీల కోణంలో వంచి నిద్రపోవాలి. అలాగే నిద్రపోయే సమయంలో ఒక భుజం ఎప్పుడూ మంచాన్ని ఆనుకుని ఉండాలి. 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు పురుషులు అర్హులు.
(And get your daily news straight to your inbox)
May 24 | రీసెర్చ్ అసోసియేట్ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్). ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.12 లక్షల వరకు ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)... Read more
May 24 | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ దేశరాజకీయాల్లోనే వినూత్నంగా తన మార్కు రాజకీయాలపై ముద్రవేశారు. తమ పార్టీ అధికారంలోకి రావడానికి మూలసూత్రమైన అవినితిపై రాజీలేని పోరాటం చేస్తామని.. ఈ విషయంలో తన, పర బేధాలకు కూడా... Read more
May 24 | నాగర్ కర్నూల్ జిల్లా మద్యం ప్రియుల అదృష్టం కలసివచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న వారంలో.. నాగర్ కర్నూలుకు జిల్లా కేంద్రానికి సమీపంలో మందుబాబులకు మద్యంబాటిళ్లు ఉచితంగా లభించాయి. అదెలా... Read more
May 24 | వైద్యులు వృత్తిపరంగా ఎలాంటి నియమనిబంధనలు పాటించాలో పొందుపరుస్తూ తాజాగా జాతీయ మెడికల్ కమీషన్ ఓ ముసాయిదా నియమావళి-2022ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ముసాయిదా ప్రతిని వారికి సంబంధించిన ఓ వైబ్ సైట్లో పొందుపర్చింది. అంతేకాదు..... Read more
May 24 | అరకు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులకు వ్యతిరేకంగా మావోయిస్టులు హెచ్చరికలు జారీచేశారు. అరకు ఎంపీ జి.మాధవి చెట్టి ఫాల్గుణ, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలకు వ్యతిరేకంగా మావోలు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులుగా శాసనసభకు, లోక్ సభకు ఎన్నికైన వీరు... Read more