భానుడి తాపానికి బ్రేక్.. వర్షంతో తడిపి ముద్దైన భాగ్యనగరం.. unanticipated rain gives temporary relief to hyderabadis

Unanticipated rain gives temporary relief to hyderabadis

Heatwave In Hyderabad, Hyderabad Heatwave, Hyderabad Rains, Pre-Monsoon Rains In Hyderabad, Rain In Hyderabad, Rain In India, Weather In Hyderabad, Weather In India

Hyderabad is all set to witness another spell of pre-Monsoon rains. City is already witnessing cloudy sky and rains began in the evening hours..

భానుడి తాపానికి బ్రేక్.. వర్షంతో తడిపి ముద్దైన భాగ్యనగరం..

Posted: 04/04/2017 08:20 PM IST
Unanticipated rain gives temporary relief to hyderabadis

హైదరాబాదీయులకు ఉపశమనం లభించింది. భగభగ మండే భానుడు.. ఇంట్లో వున్నవారిని కూడా వదలకుండా తన ప్రతాపాన్ని చూపుతుంటే.. అదే సమయంలో వరుణుడు కురిపిన ప్రేమతో హమ్మయ్య అంటూ బ్రేక్ తీసుకున్నారు. ఉదయం నుంచి భానుడి తాపానికి గురవుతున్న నగరవాసుకలు.. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో రిలీప్ పోందుతున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు ఉక్కపోతతో..భానుడు సెగలు పుట్టించగా, నిమిషాల్లో వ్యవధిలో మారిన వాతవరణం నగరవాసికి ఉపశమనం కలిగించింది.

ఆకాశం మబ్బులు పట్టి.. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో బీభత్సంగా మారింది. ఉరుములు ఉరవగా, మెరుపులు మెరువగా.. పిడుగులు పడి నగరంలో బీతావాహ వాతావరణాన్ని కల్పించాయి. పటాన్ చెరు, సంగారెడ్డిలో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ, హైటెక్ సిటీ, కూకట్ పల్లి, మియాపూర్ ఏరియాల్లో ఈదురుగాలులతో వర్షం పడింది.  అయితే ఆ తరువాత మాత్రం నగరవాసి కొంత భానుడి తాపం నుంచి ఊరటపోందాడు.

సరిగ్గా కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో రోడ్డు జలమయం అయ్యాయి. అసలే మెట్రో రైలు పనులతో ఇప్పటికే ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్న నగరవాసి.. ఈ అనుకోని అతిధిలా వచ్చిన వర్షంతో మరింతగా ట్రాపిక్ పద్మవ్యూహంలో చిక్కకుపోయాడు. అమీర్ పేట్, బంజారాహిల్స్, కోఠి రూట్లలో ట్రాఫిక్ నిదానంగా సాగుతుంది. శంషాబాద్ లో అయితే ఉరుములు, మెరుపులు భయపెట్టాయి. పాతబస్తీలోని పలు చోట్ల, రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌, మహేశ్వరం, కందుకూరు మండలలోనూ వర్షం కురిసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad  heatwave  rains  pre-monsoon rains  off season rains  weather  

Other Articles