చెల్లి పెళ్లికి అన్న క్రియేటివీటీ.. ప్రధాని మోడీ ఫిధా..! wedding card with swach bharath logo goes viral

Wedding card with swach bharath logo goes viral

narendra modi, narendra modi twitter, narendra modi follows man on twitter viral, narendra modi swachh bharat abhiyan, narendra modi twitter swachh bharat abhiyan, narendra modi trending, narendra modi twitter viral, karnataka, viral news, trending news

Nothing stopped the Bengaluru man from telling the world that he is one among the barely 2000 people whom the PM, with a followers' base of 28.7 million, had chosen to follow.

చెల్లి పెళ్లికి అన్న క్రియేటివీటీ.. ప్రధాని మోడీ ఫిధా..!

Posted: 04/04/2017 07:27 PM IST
Wedding card with swach bharath logo goes viral

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధాని న‌రేంద్ర మోడీ యావత్ దేశాన్ని స్వచ్ఛత వైపు తీసుకువెళ్లేందుకు ప్రవేశపెట్టిన ప్రాజెక్టు స్వచ్ఛా భారత్. ప్రధాని మోడీ మానసపుత్రికగా పేరొందిన ఈ ప్రాజెక్టుతో శుభ్రత, పరిశుభ్రతల దేశంగా తీరచిదిద్దాలనే. అయితే ప్రధాని కలగనగానే దేశం యావత్తు శుభ్రమైపోదు. అయితే నా దేశం శుభ్రమైంది అని, ప్రతి పౌరుడు నినదించడంతో పాటు అందుకు తన వంతుగా శ్రమిస్తే.. తప్పక దేశం స్వచ్చగా అవతరిస్తుందని అనడం అతిశయోక్తి కాదు.

అయితే అందుకు కొంత సమయం కూడా పడుతుందన్నది జగమెరిగిన సత్యం. ఇది పార్టీలకు సంబంధించిన అంశం కాదు, రాజకీయాలకు సంబంధించిన అంశం అంతకన్నా కాదు. దీంతో ఈ ప్రాజెక్టుకు దేశ పౌరులుగా ప్రతీ ఒక్కరూ నడుంబిగించాల్సిన అవసరం వుంది. ఇలా భావించే కర్ణాటకకు చెందిన అకాష్ జైన్ అనే వ్యక్తి తన వంతుగా తన చెల్లి పెళ్లికి వివాహ అహ్వాన పత్రికలో స్వచ్ఛా భారత్ లోగోను ముద్రించి.. అందరినీ అశ్చర్యంలో ముంచెత్తాడు. దానిని తన ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్టు చేశాడు.

అంతే ఇంకేముంది ఒక్కసారిగా అతనికి బొలెండంత పబ్లిసిటీ వచ్చేసింది. అదెలా అంటారా..? ఈ వివాహ అహ్వాన పత్రిక ట్విట్టర్ పోస్టుపై ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ రీట్విట్ చేశారు. అంతేకాదు తాను ఫాలో అవుతున్న సుమారు రెండు వేల మందిలో అకాష్ జైన్ ను కూడా కలుపుకున్నారు. అంతే ఇక అకాష్ అనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎంతలా అంటే అప్పటి నుంచి ట్విట్టర్ వేదికగా వస్తున్న ప్రశంసలు మునుపెన్నడూ లేనంతగా.

ఈ సందర్భంగా అకాష్ జైన్ అటు మీడియాకు, ఇటు సోషల్ మీడియాలోనే సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారారు. అయితే ఇదంతా తన గోప్పదనం కాదని, తన తండ్రి సూచలను మేరకు అలా చేశానని చెప్పుకోచ్చాడు. తన తండ్రి ప్రధాని నరేంద్రమోడీని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలను తప్పక ఫాలో అవుతుంటారని, అందులో భాగంగానే త‌న కూతురి వివాహ ఆహ్వాన ప‌త్రిక‌లో చివ‌ర‌గా స్వచ్ఛ భార‌త్ లోగోను ప్రింట్ చేయించి.. వాటిని త‌న బంధుమిత్రుల‌కు పంచాడని చెప్పుకోచ్చాడు. ఏదేమైనా కేంద్రప్రభుత్వ పథకానికి ఇలా ప్రచారం కల్పించిన యువకుడి వినూత్న ఐడియా అదుర్స్ కదూ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  twitter  swachh bharath  akash jain  wedding card  

Other Articles