సైనా నెహ్వాల్ పై ప్రతీకారం తీర్చుకున్న ‘సింధూ’రం Gavaskar criticises ICC for no action against Steve Smith

India open super series pv sindhu beats saina nehwal to enter semis

PV Sindhu, Saina Nehwal, India Open Super Series, India Open, semi-finals, Sung Ji-Hyun, badminton, sports

PV Sindhu defeated Saina Nehwal in a fiercely contested women singles quarter-final of the 2017 India Open Super Series

రసవత్తర పోరులో సైనాపై విజయ‘సింధూ’రం

Posted: 03/31/2017 09:31 PM IST
India open super series pv sindhu beats saina nehwal to enter semis

భారత స్టార్ షట్లర్లు.. మరో పరిబాషలో చెప్పాలంటూ భారత్ షెట్లర్ శివ్వంగులు తలపడిన పోరులో గతం మిగిల్చిన గాయానికి ప్రతీకారం తీర్చుకుని ముందుకు సాగింది తెలుగుతేజం పీవీ సింధు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పీవీ సింధు ఈ విజయంతో ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో సెమీస్ లోకి దూసుకెళ్లింది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 21-16, 22-20 తేడాతో ఎనిమిదో ర్యాంకర్ సైనాపై విజయం సాధించింది. ఈ గెలుపుతో సింధు సెమిఫైనల్లోకి ప్రవేశించింది. కేవలం 47 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించేసి సైనాపై విజయాన్ని నమోదు చేసుకుని సెమీస్ లోకి దూసుకెళ్లింది విజయసింధూరం.

తొలి గేమ్‌లో 7-7తో సమానంగా ఉండగా.. సైనా వరుస తప్పిదాలతో సింధు ఆధిక్యాన్ని 15-9కి పెంచుకుంది. ఇదే క్రమంలో మరిన్ని పాయింట్లు తొలి గేమ్ ను సింధు తన ఖాతాలోకి వేసుకుంది. రెండో గేమ్‌లో దూసెకెళ్లేందుకు సైనా చేసిన ప్రయత్నాలకు చివర్లో సింధు చెక్ పెట్టింది. సైనా 11-7తో ఓ దశలో ఆధిక్యానికి వెళ్లగా.. వెంటనే కోలుకున్న సింధు.. పోటాపోటీగా పాయింట్లు సాధించగా 19-19, 20-20తో ఇరువురి మధ్య రసవత్తర పోరు సాగింది. ఈ క్రమంలో సింధు రెండు వరుసా పాయింట్లతో రెండో గేమ్‌తో పాటు మ్యాచ్ నెగ్గి సెమిఫైనల్లోకి ప్రవేశించింది. దీంతో మూడేళ్ల కిందట ఎదురైన పరాభవానికి ఈ విజయంతో సింధు ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV Sindhu  Saina Nehwal  India Open Super Series  India Open  semi-finals  Sung Ji-Hyun  badminton  sports  

Other Articles