పెట్రో ధరల తగ్గింపు.. ఏప్రిల్ ఫూల్ జోక్ కాదు కదా? | Not an April Fool's joke Petrol price slashed.

Petrol and diesel price slashed

Petroleum Prices, Petrol price Cut, Petrol price Slashed, Petrol price India, Petrol price April !st, Petrol Price Revise, Petrol and Diesel Price slash, Petrol and Diesel Price Reduce, Petrol and Diesel Price, Indian Petrol Bunks, Hyderabad Petrol Price, Petrol Price April Fool

Pakistan raises, India slashed petroleum prices. Petrol price cut by Rs 3.77 per litre, diesel by Rs 2.91 per litre.

గుడ్ న్యూస్: పెట్రో ధరలు భారీగా తగ్గించేశారు

Posted: 04/01/2017 07:51 AM IST
Petrol and diesel price slashed

ఆర్థిక సంవత్సరం తొలిరోజున వాహనదారులకు భారీ ఊరట లభించింది. ప్రతీ 15 రోజులకోకసారి ఇంధన ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్న ఆయిల్ కంపెనీలు దిగొచ్చాయి. శుక్రవారం అర్థరాత్రి నుంచి పెట్రోల్ ధరలు భారీగా తగ్గించినట్లు ప్రకటించాయి.

లీటరు పెట్రోలుకు రూ.3.77, లీటర్ డీజిల్‌కు రూ.2.91 తగ్గింది. ప్రస్తుతం తగ్గిన ధరలతో హైదరాబాద్‌లో పెట్రోలు లీటరు రూ.72.14, డీజిల్ రూ.61.43కు చేరుకుంది. ఆయిల్ కంపెనీలను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయని ఆయిల్‌ కంపెనీల సమాఖ్య తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కనిష్టానికి చేరుకోవడంతో బ్యారెల్ క్రూడాయిల్ ధర నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది. ఫలితంగా 50 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

పెట్రో ధరల నియంత్రణ నిర్ణయాన్ని కేంద్రం ఆయిల్ కంపెనీలకు అప్పగించినప్పటి ధరలు పెరుగుతూ వస్తుండటంతో వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వైనం తెలిసిందే. కాగా, తగ్గిన ధరలు శుక్రవారం అర్థరాత్రి నుంచే అమలు అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol Price  Diesel Price  Slashed  

Other Articles