టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ అరెస్టు.. police arrest tjac chairman kodandaram

Police arrest tjac chairman kodandaram

Telangana, chief minister, kcr, 2k run, cpm, cpi, dharna chowk, sundaraiah vignana kedram, indira park, ntr gardens, police, curfew, leftists

Telangana JAC chairman professor kodandaram arrested by police, as he arrived at sundaraiah vignana kedram in protest of shifting dharna chowk

అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం.. కోదండరామ్ అరెస్టు

Posted: 03/26/2017 09:03 AM IST
Police arrest tjac chairman kodandaram

తెలంగాణ జేఏసీ చైర్మన్ ఫ్రోఫెసర్ కోదండరామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం అమలుపరుస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపేందుకు వీలు కల్పించకుండా ఇందిరాపార్కు ఎన్టీయార్ గార్డెన్ నుంచి ధర్నాచౌక్‌ తరలించడాన్ని నిరసిస్తూ చేపట్టిన 2 కే రన్ లో పాల్గోన్న కోదండరామ్ ను ఆయనతో పాటు వామపక్షాల నేతలను, కార్యకర్తలను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసి తరలించారు. కోదండరామ్ అరెస్టును వామపక్షాల కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసుల వాహనానికి అడ్డుగా భైఠాయించారు. వామపక్షాల నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ధర్నాచౌక్‌ తరలింపునకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి 2కే రన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాంతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేసి స్థానిక పోలిస్ స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వాలు అమలుపరుస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపేందుకు ఎన్నో ఏళ్లుగా వున్న ధర్నాచౌక్ ను శివారు ప్రాంతాలకు తరలించడం అసమంజసమని కోదండరామ్ అన్నారు.

ప్రభత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని, దీనిని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన అన్నారు. కోదండరామ్ అరెస్టు సందర్భంగా సుందరయ్య విజ్ఞన కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. కోదండరామ్ అరెస్టు నేపథ్యంలో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది, ఇందిరాపార్కు వద్ద కూడా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. నిరసనకారులను అరెస్టు చేసి తరలించడాన్ని పలువురు ప్రజా సంఘాల నేతలు ఖండించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles