నడుచుకుంటూ వెళ్లే యువతులపై.. ఇలాంటి దాడులా..? cctv footage shows bengaluru woman groped by bikers

Bengaluru woman groped by bikers cctv video provokes anger

Bengaluru, Bengaluru molestation, Bengaluru woman groped, women groped by bikers, women groped video footage, cctv footage, crime, sexual assult on women, social media

A CCTV footage from Bengaluru showing a woman being groped by the rider of a motorcycle has again brought into focus in the Vijaynagar area in western Bengaluru

ITEMVIDEOS: నడుచుకుంటూ వెళ్లే యువతులపై.. ఇలాంటి దాడులా..?

Posted: 03/22/2017 06:05 PM IST
Bengaluru woman groped by bikers cctv video provokes anger

దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా పేరోందిన బెంగళూరులో రానురాను వారిపై అకృత్యాలు శృతిమించిపోయాయి. మైనర్ బాలికలపై, విద్యార్థినులపై జరిగిన ఘటనలు ఓ వైవు వారి తల్లిదండ్రులను వణికించి క్రమంగా తగ్గుముఖం పట్టిన తరునంలో.. నూతన సంవత్సర వేళ.. సామూహిక అత్యాచారాల ఘటన తెరపైకి వచ్చి యావత్ దేశం సిగ్గుతో తలదించుకునేలా చేశాయి. వాటికి బాధ్యలైన నిందితులను కటకటాల వెనక్కి పంపిన పోలీసులను ఈ మధ్యకాలంలో వరుసగా చేటుచేసుకుంటున్న ఘటనలు కంటిమీద కునుకును కరువయ్యేలా చేస్తున్నాయి.

మహిళలకు ఎంతో సురక్షితమైన నగరం కాస్తా.. మహిళల భద్రతకు సవాల్ విసిరేలా తయారైందన విమర్శలు కూడా గుప్పుమంటున్నాయి. కన్నడ బాష రాలేదని ఇద్దరు మహిళలను మోకాళ్లపై కూర్చోబెట్టి వేడుకునేలా చేసిన దారుణ వేధింపుల ఘటన చోటుచుసుకున్న 24 గంటల వ్యవధిలోనే మరో అకృత్యం వెలుగుచూసింది. రోడ్డు పక్కన నడుస్తూ వెళుతున్న యువతుల పట్ల సభ్య సమాజం తలదించుకునేలా దారుణంగా ప్రవర్తించేందుకు యత్నించారు. అయితే వారు కొద్దిలో ఈ అకృత్యం నుంచి తప్పించుకున్నారు.

రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న యువతలను వెనకగా వైక్ పై వచ్చిన వ్యక్తులు అభ్యంతరకరంగా తాకేందుకు ప్రయత్నించి వెళ్లిపోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగళూరులోని విజయనగర్ కాలనీలో జరిగింది. ఈ మొత్తం ఘటనను స్థానికంగా ఏర్పాటు చేసిన సిసిటీవీ నిక్షిప్తం చేసింది. అయితే వారు లైంగిక వేదింపులకు యత్నించారా..? లేక చైన్ స్నాచింగ్ కోసం ప్రయత్నించారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇప్పటివరకు ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని తెలిపారు. అయినా నిందితుల కోసం గాలింపు కోనసాగుతుందని, అయితే సోషల్ మీడియాలో ఈ ఘటనను అప్ లోడ్ చేసిన వారిని కూడా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి అణుచెత్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles