యువతుల లోదుస్తుల్లో చోరికి పాల్పడిన దొంగ అరెస్టు.. Residents use CCTV to trap lingerie thief

Bengaluru cops arrest lingerie thief who prowled women s hostel

Abu Taleem, Karnataka, Bengalore, women, Hostel, lingerie thief, maharani womens collage hostel, knife-wielding nude thief,

The knife-wielding nude youth who was seen prowling the Maharani women’s college hostel campus was arrested on Wednesday.

యువతుల లోదుస్తుల్లో చోరికి పాల్పడిన దొంగ అరెస్టు..

Posted: 03/22/2017 04:38 PM IST
Bengaluru cops arrest lingerie thief who prowled women s hostel

బెంగుళూరు ఈ పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చేడి చిన్నారులపై అత్యాచారాలు. కనీసం ఐదేళ్లు కూడా నిండని చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడిన పాఠశాల వాచ్ మెన్లు, టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ లతో పిల్లలను పాఠశాలలకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడేలా జరిగిన ఘటనలను చూశాం. అలాంటి అపకీర్తి నుంచి గత కొన్నాళ్లుగా అక్కడి ప్రభుత్వం, పోలీసులు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో అవి కాస్త తగ్గుముఖం పట్టాయి. అలాంటి బెంగళూరులో ఓ వింత దోంగ మాత్రం పోలీసులకు గత అర్నేళ్లుగా కంటిమీద కునుకు కరువయ్యేలా చేశాడు.

వీడు అలాంటిలాంది దొంగ కాదు. బెంగళూరులోిన మహరాణి వుమెన్స్ కాలేజ్ లేడీస్ హాస్టల్‌లోకి ఏకంగా నగ్నంగా చోరబడి అక్కడ హాస్టల్ యువతులు అరేసిన లోదుస్తులను చోరీ చేసి వాటిని ధరించేవాడు. అప్పటి వరకు ఈ దొంగ లేడిస్ హాస్టల్ లో నగ్నంగానే సంచరించేవాడు. అయితే ఇతగాడి చేతిలో ఒక కత్తిని పట్టుకుని సంచరించడం.. హాస్టల్ లోని సిసిటీవీ ఫూటేజీల్లో బయటపడింది. దీంతో నిందితుడ్ని అరెస్టు చేసేందుకు పోలీసులు పలు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అయినా అర్నెళ్లు పాటు తప్పించుకు తిరిగిన నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
 
గమనించిన కొందరు మహిళలు అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకుని పారిపోయాడు. దొంగను పట్టుకునేందుకు సెక్యూరిటీ గార్డు కూడా తన చేతిలోని లాఠీతో దాడి చేయబోయినా తప్పించుకుని పారిపోయాడు. కాగా, ఓ హాస్టల్ విద్యార్థిని పట్ల అదే కాలేజీలో విధులు నిర్వహించిన లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించారన్న అరోపణల నేపథ్యంలో సదరు లెక్చరర్ ను సస్పెండ్ చేసిన అనంతరం అక్కడికి వచ్చిన దర్యాప్తు బృందానికి ఈ విషయాన్ని యువతులు చెప్పారు.

దీంతో సీసీటీవీలో రికార్డైన నిందితుడి దృశ్యాల నుంచి నిందితుడి ఫోటోలను తీసుకున్న పోలీసులు అన్వేషించగా, బెంగళూరు రేస్ కోర్పులో ఉద్యోగిగా గుర్తించారు. దొంగ తన సోంత రాష్ట్రం బీహారు నుంచి పదేళ్ల క్రితం బెంగళూరుకు వలసవచ్చాడని, అతడ్ని విచారించిన పలు విస్తుపోయే విషయాలను తెలుసుకున్నారు పోలీసులు. ఈ దొంగ పేరు అబుత్ అలీమ్‌ అని ఇతగాడు మహిళల లోదుస్తులను తస్కరించి వాటిని రెండు, మూడు రోజుల పాటు వాడిన తరువాత రోడ్డుపక్కన పడేస్తారని అన్నారు. ఇతగాడికి హిజ్రాలతో కూడా సన్నిహిత సంబంధాలను కలిగివున్నాడని తెలిపారు. మహిళల లోదుస్తుల దొరక్కపోతే తన భార్య లోదుస్తులను కూడా అబు తలిమ్ వినియోగించుకుంటాడని తెలిసి షాక్ అయ్యారు. ఈ దొంగను ఎట్టకేలకు పోలీసులు కటకటలా వెనక్కి పంపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh