ఈ బీరు తాగే దమ్ముందా..? నిజం తెలిసినా....! Brewery Makes Beer from ‘Toilet Water’

San diego brewery creates beer from toilet to tap recycled water

Odd news, Weird news, Funny news, Mayor Kevin Faulconer, Stone Brewery, Full Circle Pale Ale, Toilet Water, toilet to tap, San Diego brewery

A San Diego brewery unveiled its latest brew -- a beer made from recycled water dubbed "toilet to tap" by locals.

బీరు తాగగలవా ఓ నరహరి.. ఈ బీరు తాగగలవా..?

Posted: 03/22/2017 03:49 PM IST
San diego brewery creates beer from toilet to tap recycled water

బీరు పేరు వినగానే.. రుచి తెలిసినవాడు పాడే లేటెస్ట్ పాట మందుబాబులం మేము మందుబాబులం.. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ వుందండీ మందుబాబులు.. మీరు నిజంగా ఈ బీరు తాగాలంటే మీకు దాని గురించి పూర్తిగా తెలియాలి. అదెలా తయారవుతుందన్న విషయం తెలిసిన తరువాత కూడా ఒకే బాగుంది అంటారా..? లేక వాంతులు, విరోచనాలు చేసుకుంటారా..? అన్నది మీమీదే అధారపడివుంది. బీరు గురించి చెబుతూ.. అనవసర విషయాల్లోకి ఎందుకువెళ్తన్నారా అంటరా..? అక్కడికే వస్తున్నాం.

ఏదైనా ఇష్టమైన పదార్థం తినేటప్పుడు లేక తాగేటప్పుడో వాష్ రూమ్ మాట వస్తేనే కొందరికి అదోలా వుంటుంది. ఇంకోదరైతే ఇక చాలు అన్నట్లుగా కూడా ముఖం పెట్టేస్తారు. ఇలా అనేకమంది అనేక రకాలుగా తమ హావభావాలను ప్రకటిస్తారు. మరికోందరు నోటికి కూడా పనిచెబుతారు. మరి మనం వాష్ రూమ్ లో వినియోగించిన నీరుతో బీరు తయారైతే..? మీ ఎక్స్ ప్రెషన్ మాకు అర్థమైంది. కానీ ప్రశ్నకు సమాధానం లభించలేదు. మీరు ఆ బీర్ ను లాగిస్తారా..? లేక పడేస్తారా..?

అమెరికాలోని కాలిపోర్నియా మేయర్ కెవిన్ పాల్కనర్ మాత్రం అహా ఈ బీరు అద్భుతం.. కాదు అమృతం అంటూ శ్లాఘించాడట. రుచి చూసిన తరువాత ఈ మాటలు అన్నారట. అంతేకాదు ఈ బీరును తయారు చేసిన సంస్థ స్టోన్ ను కూడా ప్రశంసలతో ముంచెత్తాడట. కాలిపోర్నియాలోని సాన్ డిగో పట్టణం పరిధిలోగల లోమా లోకేషన్ లో ప్రముఖ బీరు తయారీ సంస్థ రీసైకిల్ చేసిన నీటితో ఉత్పత్తి చేసిన బీరును లాంఛ్ చేసింది. ఈ వేడుకకు వచ్చిన ఆయన బీరును సిస్ చేసిన తరువాత మాట్లాడుతూ.. నగరంలో.. టాయిలెట్ నీరును రీసైకిల్ చేసి వాటిని ఫ్యూర్ వాటర్ గా మలుస్తున్నామని చెప్పుకోచ్చారు.

రీసైక్లింగ్ చేసిన టాయ్ లెట్ వాటర్ ను ఇప్పటి వరకు టాయ్ లెట్స్, గార్డెన్ పనులకు మాత్రమే వినియోగించేవారు. అయితే తొలిసారిగా బీరు ఉత్పత్తికి కూడా వినయోగించడం.. ఫాజిటివ్ టాక్ రావడం కూడా ఈ బీరును చర్చనీయాంశంగా మార్చివేసింది. మందుబాబులు టేస్ట్ చేసి.. సూపర్ క్వాలిటీ అని ఎంజాయ్ కూడా చేశారంటోంది స్టోన్ బ్రీవింగ్ సంస్థ. త్వరలో పబ్లిక్ లోకి దీన్ని తీసుకు వెళ్తామంటోంది సంస్థ యాజమాన్యం. అయితే సేల్స్ విషయంలో మందుబాబులు దీనికి ప్రాధాన్యత ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh