ఈ కవల గడుగ్గాయిలు.. ఇళ్లు పీకి పందిరేశారు.. twin toddlers escape from cribs to have overnight party

Twin toddlers escape from cribs to have overnight party

Toddlers, Twin, Twins, child, caught on camera, caught on video, Toddler, Hilarious, funny, funny video, funny toddlers, twin toddlers party, toddlers party to night

Twin toddlers were caught escaping from their cribs to have an overnight party - including a gymnastics session and a late night talk.

ITEMVIDEOS: ఈ కవల గడుగ్గాయిలు.. ఇళ్లు పీకి పందిరేశారు..

Posted: 03/22/2017 03:17 PM IST
Twin toddlers escape from cribs to have overnight party

వీళ్లు పసిపిల్లలా.. కాదండీ బాబోయ్.. చిచ్చర పిడుగులు.. అలా అంటారేంటి అనుకుంటున్నారా..? మేము కాదు వారి తల్లిదండ్రులే ఆ మాట అంటున్నారు. రెండేళ్ల వయస్సున్న వీరిద్దరూ కవలలు. ఇద్దరిని జాగ్రత్తగా పడుకోబెట్టి వారి తల్లిదండ్రులు పక్కనున్న పడకగదిలోకి వెళ్తే ఏం చేశారో తెలుసా..? నిజమేనండీ ఇళ్లు పీకి పందిరేశారు. అంటే మొత్తంగా తమ గదిలో వున్న వస్తువులన్నింటినీ చిందరవందర చేసి పడేశారు. అమెరికాలోని న్యూయార్క్ పట్టణానికి చెందిన ఈ కవలల వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆండ్రూ, రియాన్ అనే ఇద్దరు కవలను నిద్రపొమ్మని ఊయలలో పడుకోబెడితే... వాళ్లేం చేస్తారు.. సాధారణంగా అయితే హ్యాపీగా పడుకుంటారు. అ వెనువెంటనే నిద్రలోకి జారుకుంటారు. కానీ ఈ గడుగ్గాయిలు మాత్రం అమ్మానాన్నలను కాస్తా పక్కకు వెళ్లనిచ్చి ఆడుకోవడం మొదలు పెట్టారు. వాళ్లకు కేటాయించిన బెడ్ లలోంచి మెళ్లిగా ఒక చిచ్చరపిడుగు బయటకు వచ్చి సోఫాపై కూర్చున్నాడు. అది గమనించిన రెండో వాడు తానేం తక్కువా అంటూ బయటకు వచ్చాడు.

ఇలా ఇద్దరు బయటకు వచ్చిరావడంతోనే ఆట మొదలు... తలగడ దిండ్లు, దుప్పట్లు.. ఇలా ఏది దొరికితే అది ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఎంచక్కా ఎంజాయ్ చేశారు. వాటిపై ఎగరిదూకడం.. అలసట రాగానే కొద్ది సేపు వచ్చి సోఫాలో సేదతీరుతూ.. మళ్లీ రంగంలోకి దూకి అదే తరహా అల్లరి చేయడం ప్రారంభించారు. మధ్యలో రెండు సార్లు వాళ్ల తల్లిదండ్రులు వచ్చి అంతాసర్థి వారిని పడుకోబెట్టి వెళ్లినా.. తమ దారి తమదే అన్నట్లుగా  అదే అట.. అదే జోరు.

ఇలా దాదాపుగా తెల్లారేదాక అంటే దాదాపుగా వాళ్ల తల్లిదండ్రులు లేచి వచ్చేవరకు (ఉదయం ఏడుగంటల వరకు) వారిద్దరూ అడుతూనే వున్నారు. ఈ మొత్తం అల్లరి సీసీటీవీలో రికార్డయింది. దీనిని గమనించిన పిల్లాడి తండ్రి ఆ మొత్తం వీడియోను రెండు నిమిషాల నిడివిలోకి కుదించేలా అంతా ఫాస్ట్ ఫార్వాడ్ చేశాడు. ఇక దీనిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఇంకేముంది. ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. అనేక మంది వీక్షకులు దీనిని చూస్తూ.. వార్నీ చిచ్చర పిడుగులు.. అంటూ నవ్వుకుంటున్నారు. మరెందుకు అలస్యం మీరూ ఓ లుకేయండీ..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh